-
-
సెక్స్ సైకాలజీ
Sex Psychology
Author: Dr. R. K. Ayodhya
Publisher: Sree Madhulatha Publications
Pages: 448Language: Telugu
టీనేజ్ వయసులనుండే ప్రతివారూ సెక్స్ విజ్ఞానాన్ని కూడా వారి ఎడ్యుకేషన్‌తో పాటు పెంపొందించుకోవాలి. చక్కని సైకాలజీ కూడా డెవలప్ చేసుకోవాలి.
ఈ వయస్సుల్లో మొదలయ్యే కొన్ని సెక్స్ అపోహలు, అనుభవాలు, అభిప్రాయాలు వారి భావిజీవితం మీద కూడా ప్రభావాన్ని చూపుతాయి.
అందువలన సెక్స్ పట్ల పూర్తి అవగాహనను పెంపొందించుకుంటే – వారికి అసలు వాస్తవాలు అర్థమవుతాయి. మానసిక సెక్స్ సమస్యలు నిజానికి చాలా చిన్నవి.
అయినా... అవగాహనాలోపం వలన మానసికంగా వాటి బలం పెరుగుతూ జఠిలమవుతాయి.
పెళ్ళయిన వారిలో కూడా రకరకాల సెక్స్ సమస్యలు ఎదురవుతుంటాయి. దాదాపుగా ఇవన్నీ కూడా మానసిక సంబంధమైనవే.
దంపతుల మధ్యన చిన్న సెక్స్ సమస్య వచ్చినా తగిన అవగాహనతో ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే అనుకూలంగా వున్న సైకియాట్రిస్ట్‌ను కలవాలి గానీ అశ్రద్ధ చేయకూడదు.
ఈ సెక్స్ సైకాలజీ గ్రంథములో దంపతుల మధ్య వచ్చే కొన్ని సాధారణమైన సెక్స్ సమస్యలనూ... వాటికి మానసిక కారణాలనూ... పరిష్కార మార్గాలను వివరించడం జరిగింది.
- డా. ఆర్. కె. అయోధ్య
