-
-
సెవన్త్ కిల్లర్
Seventh Killer
Author: Madhubabu
Publisher: Madhubabu Publications
Pages: 131Language: Telugu
“హకీం గుట్టల్లో ఎప్పుడో అంతరించిపోయిన జీవజలాన్ని తిరిగి బయటికి రప్పించినందుకు నిన్ను అభినందిస్తున్నాను.....నీకు పన్నెండు గంటలు వ్యవధి ఇస్తాను. హాయిగా ఆనందంగా గడుపు....రేపు సాయంత్రం సూర్యాస్తమయం అయ్యేలోపుగా నీకు మరణశిక్ష విధించబడుతుంది.......” నడుము మీద చేతులు వేసుకుని హూందాగా అన్నాడు సఫియా సుల్తాన్.
నేల అడుగున వున్న జలధారను బయటికి రప్పించటానికి తను సృష్టించిన ప్రేలుడే తన కొంప ముంచిందని గ్రహించి గాఢంగా నిట్టూర్చాడు షాడో.
నిశబ్దంగా వున్న ఎడారిలో చాలా దూరం వినిపించి వుంటుందా మ్రోత..... ఆకాశం అంటుకునేటంత ఎత్తుకు లేచిన అగ్నిజ్వాలలు అతనికి తానున్న ప్రదేశాన్ని పిన్ పాయింట్ చేసి చూపించాయి..... ఎవరి అంతు చూడటానికి తను పెద్ద మొనగాడిలా బయలుదేరాడో, ఆ వ్యక్తి చేతిలోనే బంధీ అయిపోయాడు తను......
హకీం గుట్టలకు ఆరుమైళ్ళ దూరంలో వున్న ఒక పల్లపు ప్రదేశంలో కాంప్ ఏర్పాటు చేశాడు సఫియా సుల్తాన్. మందపాటి కాన్వాస్ క్లాత్‌తో తయారు చేయబడిన గుడారంలో షాడోని బంధించాడు.
నోరు ఊరించే రొట్టెలు, ఖర్జూరాలు, వెచ్చ వెచ్చటి టీ అతని ముందుకు వచ్చేశాయి......
