• Selayeti Diviti
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 99
    360
    72.5% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • సెలయేటి దివిటీ

    Selayeti Diviti

    Author:

    Publisher: Satya Prachuranalu

    Pages: 114
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

తూ.గో.జిల్లా జగ్గంపేటలో జన్మించిన డా|| కె.గీతా మాధవి "కె.గీత" పేరుతో కవయిత్రిగా రచనా ప్రపంచానికి గత పాతికేళ్లుగా చిరపరిచితురాలు. ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి కె. వరలక్ష్మి వీరి మాతృమూర్తి. భర్త శ్రీ సత్యన్నారాయణ, ముగ్గురు పిల్లలతో కాలిఫోర్నియాలోని సన్నీవేల్ లో నివాసముంటున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలోఇంగ్లీషు, తెలుగు భాషల్లో ఎం.ఏ లు, తెలుగులో పిహెచ్.డి చేసి, 10 సం. రాల పాటు మెదక్ జిల్లాలో ప్రభుత్వ కళాశాల అధ్యాపకురాలిగా పనిచేసారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నించి 2006 లో "ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు " పొందారు. అమెరికాలో ఇంజనీరింగ్ మేనేజ్ మెంట్ లో ఎం.ఎస్ చేసి, ప్రస్తుతం సాఫ్ట్ వేర్ ఫీల్డు లో “కస్టమర్ సక్సెస్ మేనేజర్ “గా పనిచేస్తున్నారు. ద్రవ భాష(2001), శీత సుమాలు(2006), శతాబ్ది వెన్నెల (2013) , సెలయేటి దివిటీ (2017) వీరి ప్రచురింపబడిన కవితా సంపుటాలు. కవిత్వంలో అజంతా అవార్డు, సమతా రచయితల సంఘం ఆవార్డు, రంజనీ కుందుర్తి, దేవులపల్లి మొ.న అవార్డు లు పొందారు. రేడియో కార్యక్రమాలలో విరివిగా పాల్గొన్నారు. సాహిత్య అకాడెమీ ఆహ్వానంపై దేశం లోని ఢిల్లీ, బొంబాయి, కలకత్తా, అస్సామ్ వంటి అనేక ప్రాంతాల్లో సభల్లో పాల్గొన్నారు. అనేక కవితలు, కథలు, వ్యాసాలు, పాటలతో బాటూ 'గీతా కాలం' శీర్షికన ఆంధ్ర భూమి లో కాలమ్ , "అనగనగా అమెరికా" శీర్షికన ఆంధ్ర ప్రభ లో కాలమ్, వాకిలి పత్రికలో "సిలికాన్ లోయ సాక్షిగా" ధారావాహిక కథలు రాసారు. గత అయిదేళ్లుగా "నా కళ్లతో అమెరికా " శీర్షికన విహంగ పత్రికలో నెల నెలా ట్రావెలాగ్స్, మూడేళ్లుగా కౌముదిలో "వెనుతిరగని వెన్నెల" ధారావాహిక నవల రాస్తున్నారు.
బాటా తెలుగు బడి కి "పాఠశాల" కరికులం డైరక్టర్ గా సేవలందిస్తున్నారు. లలిత సంగీతం లో మంచి ప్రవేశం తో బాటూ అనేక బహుమతులు అందుకున్నారు. ఇటీవల "బట్టర్ ఫ్లైస్" సినిమా తో గీత రచయితగా, గాయనిగా సినిమా రంగ ప్రవేశం చేశారు. "వీక్షణం" సాహితీ సంస్థ, "తెలుగు రచయిత" రచయితల వెబ్సైటు, గాటా - GATA(Gobal Association of Telugu Authors) సంస్థాపక అధ్యక్షులు, నిర్వాహకులు.

***


కొండ వాలుపై నిల్చుని
ఆకాశంకేసి చూస్తున్న
నిరాధార జీవితమ్మీద
ఒక వానపూల తీగొచ్చిపడ్డట్లు
ఎక్కడి నుంచో
గొప్ప పరిమళభరిత
కవిత్వమొకటి
నిలువెల్లా కురుస్తూ-
నిర్వికార
నిరాకార
బాంధవ్యమొకటి
కళ్లే చేతులై చుట్టేస్తూ-
హృదయం
బయటెవరో అవిశ్రాంతంగా
తడుతున్న చప్పుడు
హృదయం లోపల
ఎవరో అకస్మాత్తుగా
దుమికిన చప్పుడు....

Preview download free pdf of this Telugu book is available at Selayeti Diviti