Description
అసలు గొప్పవాళ్ళం కావాలని అనుకోకపోవడమే నిజమైన గొప్పతనం. నలుగురిలోను ప్రత్యేకంగా కనిపించాలని అనుకోకపోవడంలోని ప్రత్యేకత అందరికి అర్థం కాదు. అలా ఉండగలిగితే అంతకన్న కావలసింది ఏముంది? -అనామకుడు
ఈ 'అనామకుడు' మనోధర్మంతో, జీవిత పరమార్థాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేసే రచయిత. వెల్లడిగా, - "ముందస్తు నిశ్చితాభిప్రాయాలు" ఏర్పరచుకోకుండా - చుట్టూ మనుషుల్ని అర్థంచేసుకొనే ప్రయత్నం ఒక సామర్థ్యం. ఒక కళ. ఈ కళ తెలిసిన రచయితలే "స్వతంత్ర"రచనలు చేయగలుగుతారు.
ఈ కళ నెరిగి, కథలు చెప్పిన రచయితగా 'అనామకుడు' సుమారు రెండు దశాబ్దాలుగా కథలు వ్రాశారు. ఏ సిద్ధాంతాల మూసకట్టులోంచీ కాకుండా విశాల జీవితంలో నుంచి భిన్న అనుభవాలు చెప్పే కథలివి.
ఇవి జీవన తాత్త్విక దృష్ట్యా అరుదైన కథలు.
ఇందువల్ల - ఈ 'అనామకుడు' తెలుగు కథా సాహిత్యంలో 'సునామకుడు'గా నిలుస్తారని నా ఆశంస -
- ఇంద్రగంటి శ్రీకాంతశర్మ
Preview download free pdf of this Telugu book is available at Seelamaa adi yEmi
Login to add a comment
Subscribe to latest comments
