-
-
సైంటిస్ట్ మిస్ మాధురి
Scientist Miss Madhuri
Author: Madhubabu
Publisher: Madhubabu Publications
Language: Telugu
మధుబాబు కలం నుంచి జాలు వారిన అతి కొద్ది సైన్స్ ఫిక్షన్ నవలలో " సైంటిస్ట్ మిస్ మాధురి " ఒకటి. చివరి దాకా ఆసక్తికరంగా చదివిస్తుంది.
* * *
సరిగ్గా ఉదయం 8-15 నిముషాలకు 'స్పేస్'లో ఒక స్ట్రేంజి ఆబ్జెక్టును డిటెక్ట్ చేసింది రాడార్. ప్లయింగ్ సాసర్లా కనిపిస్తున్న ఆ ఆకారం 8-23 నిముషాలకు మధ్యప్రదేశ్ అరణ్యాలలో వున్న బింగో సరస్సులో పడింది. ఆ సరస్సు చుట్టూ వున్న కొండల్లో యురేనియం గనులున్నాయి. విస్తృత పరిశోధనల కొరకు ప్రభుత్వం నియమించిన ప్రొఫెసర్ ఈశ్వర్ నాయకత్వంలోని సైంటిస్టుల బృందం అక్కడ పని చేస్తుండగా, ప్లయింగ్ సాసర్ లాంటి ఆ వస్తువు లోంచి వింత ఆకారాలు బయటికొచ్చి, తమ వద్ద ఉన్న ఒక భయంకరమైన ఆయుధంతో అత్యంత ప్రమాదకరమైన కిరణాలను వెలువరించి, సైంటిస్టులపై దాడికి దిగుతాయి. సైంటిస్టుల బృందాన్ని రక్షించడానికి అక్కడికి వెళ్ళిన షాడో ఏయే ప్రమాదాలను ఎదుర్కున్నాడు?
నిరుత్సాహపడుతున్న సైంటిస్టు మాధురిని ప్రోత్సహించి ఆమె చేత ఆ కిరణాలకు విరుగుడుని తయారుచేయించటానికి ఏ విధంగా కృషి చేశాడు షాడో? ఆ ప్లయింగ్ సాసర్ రహస్యాన్ని ఎలా ఛేదించాడు? వింత ఆకారాల, వాటి వెనుక ఉన్న దేశద్రోహుల గుట్టు ఎలా రట్టు చేసాడు?
షాడో చేసిన ఉత్కంఠభరితమైన సాహసకృత్యాలను అతని మాటలలోనే ఈ రోమాంచక నవలలో చదవండి.
This book is now available in Tenglish script with Kinige. For details, click the link.