-
-
సైన్స్ ఎందుకు రాస్తున్నాం?
Science Enduku Rastunnam
Author: Nagasuri Venu Gopal
Publisher: Vignana Prachuranalu
Pages: 231Language: Telugu
సైన్సు ఎందుకు రాస్తున్నాం?
నడుస్తున్న పరిశోధనల ప్రస్తానాన్ని గమనించి, కీలకమైనవి ఎంపిక చేసుకుని, సంబంధింత సామగ్రి అధ్యయనం చేసి, స్థానిక కోణం జోడించి, తగిన తెలుగు పదాలు వెతుక్కుని - పిమ్మటే పాపులర్ సైన్స్ రచనకు ఉపక్రమించాలి! ఎక్కువ శ్రమతో కూడిన వ్యవహారం స్థానిక భాషలలో సైన్స్ రచన. మరి తెలుగులో ఇపుడు ఎంతమంది సైన్స్ రచనలు చేస్తున్నారు? ఎందుకు రచనలు చేస్తున్నారు? ఎలా చేస్తున్నారు? - వంటి విషయాలు చెబుతున్నారు 32 మంది సైన్స్ రచయితలు. డా. నాగసూరి వేణుగోపాల్, జి.మాల్యాద్రిగార్లు వెలువరించిన 224 పేజీల సైన్స్ ఎందుకు రాస్తున్నాం? సంకలనంలో పి.వి. అరుణాచలం, కొండముది హనుమంతరావు, ఎం.వి.రమణారెడ్డి, కవనశర్మ, చిత్తర్వు మధు, దేవరాజు మహరాజు, తల్లావజ్ఝల పతంజలి శాస్త్రి, జమ్మి కోనేటిరావు, కె.బి.గోపాలం, చాగంటి కృష్ణకుమారి, ఎన్.ఇన్నయ్య, చందు సుబ్బారావు, జి. సమరం, నాగసూరి వేణుగోపాల్, వేమూరి వేంకటేశ్వరరావు, వక్కలంక వెంకట రమణ, సమ్మెట గోవర్థన్, బడుగు జానకి, జి.వి.పూర్ణచంద్, వి.వి.వేంకటరమణ, శ్రీనివాస చక్రవర్తి, ఇండ్ల రామసుబ్బారెడ్డి, వివినమూర్తి వంటి రచయితలు - ఎందుకు రాశారో, ఏమి రాశారో, ఎటువంటి ఫలితాలు సాధించారో వివరిస్తున్నారు ఈ గ్రంథంలో. తెలుగులో సైన్స్ రచనా తీరు గురించి తెలుసుకోవడానికీ, అధ్యయనం చేయడానికీ, పరిశోధనలు కొనసాగించడానికీ ఈ సంకలనం సైన్స్ ఎందుకు రాస్తున్నాం? ఎంతగానో దోహదపడుతుంది.
- విజ్ఞాన ప్రచురణలు

- ₹113.00
- ₹216
- ₹225.00
- ₹60
- ₹162
- ₹135.00