-
-
సౌరశక్తి కథ
Saurashakti Katha
Author: Aravind Gupta
Publisher: Manchi Pustakam
Pages: 54Language: Telugu
మూలం: అరవింద్ గుప్తా
తెలుగు: డా. శ్రీనివాస చక్రవర్తి
ఈ పుస్తకంలో సౌర శక్తి చరిత్రను ఒక కథలాగా చెప్పారు. ఎన్నో ప్రాచీన సంస్కృతులలో సూర్యుడిని ఒక దేవతలాగా ఆరాధిస్తారు. సౌర గృహ నిర్మాణంలో గ్రీకులు అగ్రగాములు.
చలికాలంలో ఎండ బాగా పడేలా తమ ఇళ్ల దిశని ఏర్పాటు చేసుకుని కట్టుకునేవారు. గాజు కిటికీలను మొట్టమొదట వాడిన వారు రోమన్లు. హరితగృహాలు, సౌరస్నానశాలలను వారు నిర్మించారు. 150 ఏళ్ల క్రితం సర్ విలియమ్ హెర్షెల్ అనే ఖగోళశాస్త్రవేత్త దక్షిణ ఆఫ్రికాలో దక్షిణ ప్రాంతపు తారా విన్యాసాలని అధ్యయనం చేసే కాలంలో సోలార్ కుక్కర్ సహాయంతో వండుకునేవాడు.
చమురు, గ్యాస్, బొగ్గు మొదలైన శిలాజ ఇంధనాలు వేగంగా తరిగిపోతున్నాయి. వాటి వల్ల కాలుష్యం పెరుగుతుంది.
హరితగృహ వాయువులు పెరుగుతాయి. ధరాతాపనం పెరుగుతుంది. ఫుకుషీమా ఉపద్రవం తరువాత అణుశక్తి వినియోగం గురించి ప్రపంచం పునరాలోచిస్తోంది. భవిష్యత్తుని శాసించే శక్తులు వాయు, సౌర శక్తులే.
భారతదేశంలో మనకు పుష్కలంగా ఎండ కాస్తుంది. ఈ సతత, నిర్మల శక్తి స్రవంతిని మనం వాడుకోవడం అలవరచుకోవాలి. మన తెలివితేటలు వీటి మీద శ్రద్ధగా ప్రయోగించి, పరిశోధనలు చేసి అతి తక్కువ ఖర్చుతో సౌరఘటాలని ఉత్పత్తి చెయ్యాలి. సమర్థవంతమైన సౌర కుక్కర్లు రూపొందించాలి.
వికేంద్రీకృత సౌర శక్తిని ఉపయోగించి సుదూర ప్రాంతాల్లో ఉండే పల్లెలకి కూడ శక్తి సరఫరా చెయ్యొచ్చు. అలా చేస్తే ప్రజల చేతికి అధికారం ఇచ్చినట్టు అవుతుంది. గాంధీ కలలు కన్న గ్రామీణభారతం అప్పుడు నిజమవుతుంది.
సౌర శక్తి పై అవగాహన కోసం ఈ అరవింద్ గుప్తా వ్రాసిన 'సౌర శక్తి కథ' చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఎంతో ఉపయోగపడుతుంది. పుస్తకం మొత్తం బొమ్మల రూపంలో ఆసక్తికరంగా ఉంది. ప్రాచీనులు సౌరశక్తి వాడకం నుంచి నేటి వరకు, వాటికి గల అడ్డంకులన్నీ సులభంగా వివరించారు.