-
-
సత్యజిత్ రే కథలు
Satyajit Ray Kathalu
Author: Satyajit Ray
Publisher: Kavya Publishing House
Pages: 96Language: Telugu
సత్యజిత్ రే కథలు
మూలం: సత్యజిత్ రే
తెలుగు: మమత
సత్యజిత్ రే అనగానే ''పథేర్ పాంచాలి, షత్రంజ్ కి కిలాడి'' వంటి సినిమాలు గుర్తుకొస్తాయి. రే వెండితెర మనిషి మాత్రమే కాదు. ఆయన ఒక చరిత్రకారుడు, కథకుడు, కవి, వాణిజ్య ప్రకటనలకు ఒరవడి దిద్దినవాడు ఇంకా మరెన్నో...
1921 మే 2న కలకత్తాలో రచయితల కుటుంబంలో పుట్టి, గురుదేవుడు రవీంద్రుడు నెలకొల్పిన ''శాంతి నికేతన్''లో కళలు నేర్చుకుని, మనిషి ఊహాశక్తికి పదును పెట్టే బొమ్మలు గీసి, సినిమాలు తీసి, కథలు రాసి - అన్నింటిలో అంతర్జాతీయ కీర్తి గడించిన బహుముఖ ప్రజ్ఞాశాలి - ప్రాథమికంగా కళాకారుడు - సత్యజిత్ రే. తాతగారు ఉపేంద్ర కిశోర్రే ప్రారంభించగా మధ్యలో ఆగిపోయిన పిల్లల పత్రిక 'సందేశ్'ని 1961లో పునరుద్ధరించి - తన పలు రకాల పనుల మధ్య - అందులో ఎన్నెన్నో కథలు, కవితలు, వ్యాసాలు రాశారాయన. 1992 ఏప్రిల్లో రే చనిపోయారు.
ఈ పుస్తకంలో ఉన్నవి - సత్యజిత్ రే - పిల్లల కోసం రాసిన కథల్లో కొన్ని. ఈ కథలు - మనసులో బాల్యం పరిమళాల్ని కాపాడుకున్న పెద్దల కోసం కూడా...
