-
-
శత్రువుతో ప్రయాణం
Satruvuto Prayanam
Author: K. Ramalakshmi
Publisher: Stree Shakti Prachuranalu
Pages: 142Language: Telugu
ఉదయం లేస్తూనే కాలేజికి తెములుతోంది. అప్పటికే పదినిముషాలు లేటు. తలుపు మూయబోతుంటే వెంకటేష్ ఆదరాబాదరాగా పరుగెత్తి లోపలికి వచ్చాడు. చొక్కాలో దాచిన ఉత్తరం తీసి యిస్తూ మళ్లీ వస్తానంటూ అంత వేగంగానూ చక్కాపోయాడు. ఆ టైములో వాడికి పని రద్దీ ఎక్కువ. సవాలక్ష పనులు. ఇప్పుడిది తెరవడం ఎలా అని ఆలోచిస్తుంటే రమ పరుగున వచ్చింది. 'ఆంటీ సురేష్ బయటికి వెళ్లాడు. ఇప్పుడే రాను నువ్వు భోజనం చేసెయ్యి. తలుపులు వేసుకు పడుకో అన్నాడు'' భయంగా చెప్పింది. ఆమె లోలోపల ఒణికిపోతోందని గ్రహించింది సుజాత.
సుజాత వచ్చిన ఉత్తరం రమకి చూపెట్టింది 'బొంబాయి నుంచి వచ్చింది. నీకూ అతనికీ అక్కడ స్నేహితులేనా చుట్టాలేనా ఉన్నారా?'
'లేరాంటీ ఎవరూ లేరు. మీరా ఉత్తరం చదవండి తెలిసిపోతుంది కదా!'
''ఏదైనా గొడవ అయితే' అనుమానంగా అడిగింది సుజాత.
''ఇప్పటికంటే అయ్యేదేముంది చదవండి'' రెట్టించింది రమ.
'తెరచినట్టు తెలియకుండా తెరచి చూడాలి. ఎలా' ఆలోచిస్తున్న సుజాతకి రమ గొప్ప ఐడియా ఇచ్చింది..
