• Satruvu
  • fb
  • Share on Google+
  • Pin it!
 • శత్రువు

  Satruvu

  Author:

  Pages: 146
  Language: Telugu
  Rating
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  Be the first to vote
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  '0/5' From 0 premium votes.
Description

సరిగ్గా తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు రెస్టారెంట్ లోపలకు అడుగుబెట్టింది చిత్రలేఖ. ఆమె తనను వెంటనే గుర్తుపట్టడం కోసం తన సీట్లోంచి లేచి నిలబడి న్యాప్‍కిన్ ఆమెవైపు ఊపసాగాడు మదన్‌గోపాల్. చిత్రలేఖ రాగానే, తగ్గు స్వరంతో - "రాణీగారు లేట్‌గా విచ్చేశారేం?" అన్నాడు మదన్‌గోపాల్ నవ్వుతూ

వాళ్ళు కూర్చున్న తీరు ఎవరైనా చూస్తే ఏదో వ్యాపార విషయాలు మాట్లాడుకుంటున్నట్లుగా భావిస్తారే తప్ప, వాళ్ళిద్దరూ ప్రేయసీ ప్రియౌలని ఏమాత్రం ఊహించరు. అంత పకడ్బందీగా నటిస్తున్నారు ఆ ఇద్దరూ.

ఇంతలో ఓ వెయిటర్ వాళ్ళ టేబుల్‌పై ప్లేట్లు, స్పూన్స్ వుంచి, రెండు బవుల్స్ నిండా మష్‌రూమ్ కార్న్ సూప్ తెచ్చాడు. అతడ్ని మళ్ళీ రమ్మన్నట్లుగా సైగ చేసాడు మదన్‌గోపాల్.

"డియర్! నువ్వే పని చేసినా చాలా బ్యూటీఫుల్‌గా అరేంజ్ చేస్తావు" అన్నది ఎదురుగా వున్న పదార్థాల్ని చూస్తూ".

''మరి అదేగదా మన ప్రత్యేకత డార్లింగ్!"

"నిన్ను చూస్తూంటే మనసంతా ఏదోలా అనిపిస్తుంది డియర్!" అతడివైపు గోముగా చూస్తూ పలికింది చిత్రలేఖ.

"దాన్నే ప్రేమ అంటారు డార్లింగ్!" చిత్రలేఖను తేరిపార చూస్తూ అన్నాడు. తెల్లని చీర, అదే రంగు జాకెట్, మెడలో ముత్యాల దండ, బ్యూటీ పార్లర్ లోండి అప్పుడే వస్తున్నట్లు మేనిక్యూర్ చేయబడ్డ చేతులు, అందంగా వేసిన జుట్టు ముడి, దానిలో ఓ తెల్ల గులాబీ... దివి నుంచి దిగివచ్చిన అప్సరసలా కనిపిస్తోంది చిత్రలేఖ.

''నిన్నిలా చూడగలగడం నా అదృష్టం చిత్రలేఖా!" ఆమె చేతిని తన రెండు హస్తాలతో స్పృశిస్తూ అన్నాడు మదన్‌గోపాల్ తన్మయత్వంతో.

''ష్.. ఎవరైనా చూస్తే బాగుండదు." అంటూ చిలిపిగా అతడి వైపు చూసింది చిత్రలేఖ.

Preview download free pdf of this Telugu book is available at Satruvu