-
-
శతపత్ర
Satapatra
Author: Suryadevara Rammohana Rao
Publisher: Madhu Priya Publications
Pages: 398Language: Telugu
"మన శరీరంలో అనేక ధాతువులు మిశ్రమంగా ఉంటాయి గదా! ఎక్కడో నూటికో కోటికో కొందరి శరీరాల్లో భాస్వరం శాతం అధికంగా ఉంటుందట. అలాంటివాళ్ళు మాంచి ఎండలో నడవటం ప్రమాదమట. ఎండ వేడిమికి శరీరంలోని భాస్వరం వేడెక్కి భగ్గున మండి చూస్తుండగానే ఆ మనిషి కాలి బూడిదైపోతాట్ట. అలా కాలిపోయిన వాళ్ళ ఫోటోగ్రాఫ్స్ కూడ కొన్ని ప్రచురించారు. చాలా ఆశ్చర్యమనిపించింది. నిజంగా ఇలా జరుగుతుందా అనిపించింది. కాని అది యధార్ధ సంఘటన'' అంటూ తను చదివిన విషయాన్ని చెప్పుకొచ్చాడు బాలగోపాలం.
''అవును బాబాయ్. ప్రపంచంలో నమ్మలేని నిజాలు అనేకం ఉన్నాయి. వాటిలో నువ్వు చెప్పిందే కాదు. నేను చెప్పిందీ నిజమే. ప్రతి ఏటా ఈ భూమ్మీద ఏదో చోట కొందరు మనుషులు అంతర్థానమైపోతున్నారు'' అంది.
''ఎలా మాయమైపోతారు? వాళ్ళకేమన్నా మంత్రశక్తులున్నాయా? మాయమై ఎక్కడికి పోతున్నారు?''
''మనుషులు అదృశ్యమయిన సంఘటనలు మాత్రం వాస్తవం. వాళ్ళు ఏమవుతున్నారు? ఎక్కడికి పోతున్నారో తెలీదు. మాయమైన వాళ్ళు తిరిగి వచ్చిన దాఖలాలు కూడ లేవు. జస్ట్ వేనిష్. అంతే...''
''ఓ మైగాడ్. నమ్మలేకపోతున్నాను...''
''ఒకరూ ఇద్దరు కాదు. సామూహికంగా అదృశ్యమైన సంఘటనలు కూడ అనేకం వున్నాయి. సైన్స్ ఎంత అభివృద్ధిచెందినా, ఈ మిస్టరీని కూడా ఇంతవరకు ఎవరూ పరిష్కరించలేకపోయారు. ఏదో ఒకచోట కాదు, వేరు వేరుచోట్ల వేరు వేరు సమయాల్లో మనుషులు అంతర్థానమైన సంఘటనలు చాలా ఉన్నాయి."
మొదటి వంద పేజీలూ సాహసోపేతంగా బావుంది. తరవాత అన్ని తెలుగు సినిమా కధలూ (పౌరానికం, రాజకీయం, మాఫీయా) దీనిలో వున్నాయి.
How to download it
nice one.., all about a dream, the story flows.. its like fantasy story
Nice Novel story bagundhi.Chala baga analem kaani bagundi kontha varaku thrilling ga exciting ga madyalo konchem flow miss aina total ga book bagundhi.
Good and boring ..both mixup
Very good.