-
-
శతాబ్ది వెన్నెల
Satabdi Vennela
Author: Dr. K. Geeta
Publisher: Self Published on Kinige
Pages: 108Language: Telugu
శతాబ్ది వెన్నెల
Poetry by Dr K.Geeta
వెన్నెట్లోకెళ్లే ముందు -
ఇది నా మూడవ కవితా సంపుటి. 2001 లో ద్రవభాష, 2006 లో శీతసుమాలు దేనికవే ప్రత్యేక సందర్భాలు. అయినా ఇప్పుడు 'శతాబ్ది వెన్నెల ' ఒక వైవిధ్యమైన ప్రవాస సందర్భం. ఈ కవితలన్నీ దాదాపుగా కాలిఫోర్నియా వచ్చేక రాసినవి. ప్రవాస జీవితం ఒక అనుకోని, అరుదైన మలుపు నా జీవితంలో. అయితే ఇక్కడ జీవితంలో కొత్త ఆనందాలతో బాటూ, సమాజంలో ప్రత్యేక భాగస్వామ్యత లోపించిన నిర్లిప్తత, వెనకటి జీవితంలో ఉన్నవేవో కోల్పోయిన, కోల్పోతున్న చేదు అనుభవాలు కూడా కలగడం రెండో పార్శ్వం.
ఇక్కడ విచిత్రమైన చల్లని గాలీ, మంచు చల్లని సముద్రం, తళ తళా మెరిసే వెల్తురు, అందమైన పూలు, రంగుల చెట్లు, పరిశుభ్రమైన పరిసరాలతో బాటూ నిద్రపోతే పాత జ్ఞాపకాల్లో కలయదిరగడం, ఉదయ మధ్యాహ్న సాయంత్రాలు క్షణాల్లా దొర్లిపోవడం విచిత్ర అనుభవాలు. ప్రతీదీ రూపాయల్లో తర్జుమా చేసుకుని భయపడే స్థితి నుంచి డాలరుని రూపాయిగా చూసే క్రమమానికి మనసు అలవాటు పడడం, రెండు ప్రపంచాల్లోనూ ఇమడ లేని స్థితి నుంచి నాదనే ప్రత్యేక ప్రపంచాన్ని ఇక్కడా ఏర్పాటు చేసుకుని విస్తృతమయ్యే(?) సందర్భం.
డిపెండెంట్ జీవితం లోని వ్యధావేదన, చుట్టూ పోటీ ప్రపంచంలో కాళ్లు చేతులు కట్టేసే నిబంధనలు కాలం మాన్చే క్రమమైన గాయాలైన సందర్భం. ఇంటర్నెట్టు అంటే ఏమిటో తెలీని స్థితి నుంచి ఇంటర్నెట్టు మాత్రమే రోజు మొత్తం మీద ప్రధాన వాహకమైన పరిణామం. ప్రపంచ వ్యాప్త సినిమాల్ని, రచనల్నీ, ఎన్నో కొత్త వేష భాషల ప్రపంచాన్ని దగ్గర్నించి పరిశీలించే గొప్ప అవకాశం లోనూ రోజూ వెల్తిని పూడ్చే అన్వేషణేదో. ఇక్కడి నాలుగు వందల సంవత్సరాల చరిత్రని, ఇప్పటికీ కొనసాగుతున్న దోపిడీని, ఇక్కడా తాండవించే పేదరికాన్ని తెల్సుకునీ, చూసీ ఆశ్చర్యచకితమైన సందర్భం.
అయితే అన్నిటినీ మించి స్థిమితంగా పసిపాపతో ఆడుకునే అద్భుతమైన వర్తమాన సందర్భం... ఈ శతాబ్ది వెన్నెల.
- కె.గీత
* * *
ఈ పుస్తకంపై వివిధ పత్రికల్లో వచ్చిన సమీక్షల లింకులు:
కౌముది సమీక్ష
ఈభూమి సమీక్ష
పుస్తకం.నెట్ సమీక్ష
