-
-
శశికళ
Sasikala
Author: Adavi Bapiraju
Publisher: BPMD Publications
Pages: 122Language: Telugu
Description
"పూవులో తేనెవై
తావిలో మత్తువై
పాటలో ఫణితివై
మాటలో తేటవై"
అంటూ అలతి అలతి పదాలతో తన చెలి గురించి పాడుకుంటూ అమరత్వభావనతో పరవశించిపోయారా రచయిత.
"కలలోని పాపవా
కతలోని బాలవా?"
"ఓ చెలీ నీ వెవరు" అని ప్రశ్నిస్తూనే తన చెలిని ప్రస్తుతించుకున్నారా చిత్రకారుడు.
"ఆనా డజంతాన
ఆంధ్రపురి కటకాన
ఆంధ్రకవి స్వప్నాన
ఆంధ్ర నటకరణాన
ఆంధ్ర సంస్కృతినేనె
ఆంధ్రత్వమీవటే!"
అని చెలికోసం పాడుకునే ప్రేమ పాటలమధ్య చరిత్ర కవితలల్లారా కవి.
ఇంత ప్రేమ పరవశాన్ని పొందిన ఆ కవి, రచయిత, చిత్రకారుడు...మన 'కులపతి' అడవి బాపిరాజు గారు. తనపై ఇన్ని కవితలు అల్లేలా ఆయన పై వలపు వలవేసిన ఆ ఊహాసుందరే ఈ "శశికళ".
Preview download free pdf of this Telugu book is available at Sasikala
Login to add a comment
Subscribe to latest comments
