• Sarve Janah Sukhino Bhavantu
    • fb
    • Share on Google+
    • Pin it!
  • సర్వే జనఃసుఖినో భవంతు

    Sarve Janah Sukhino Bhavantu

    Publisher: Chinuku Prachurana

    Pages: 86
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 40 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


ఆయాసంతో రొప్పుతున్న పరిగెడుతున్నాడు పాపం పసివాడు. 12 సంవత్సరాలుంటాయి... బీదరికాన్ని సూచించే ఆనవాలు అతడి ఒంటిమీది వస్త్రాలను చూస్తే తెలుస్తుంది.


ఒళ్ళంతా ముళ్ళతో గీరుకుపోయి రక్తాలు కారుతున్నాయి. అయినా పరిగెడుతూనే వున్నాడు. ఏ దిక్కు కూడా తెలియదు పరిగెడుతూనే ఉన్నాడు. ఆయాసం ఎక్కవైనప్పుడు మోకాళ్ళమీద చేతులుంచి కాసేపు ఆగి మళ్ళీ పరుగు లకించుకుంటున్నాడు. కళ్ళముందు మరణించిన తల్లిదండ్రులకన్నా తన్ను తరుముతూ వచ్చిన రాక్షసులే అతడి కన్నుల ముందు కనిపిస్తున్నారు. అందుకే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అలుపుని ఆయాసాన్ని లెక్కచేయకుండా పరిగెడుతూనే వున్నాడు. ఎంతసేపు అలా పరిగెట్టాడో గాని అక్కడికి రాగానే వేగం తగ్గించాడు.


చుట్టూ చల్లని నీడనిచ్చే చెట్లు చక్కగా వున్నాయి. వాటిపై సంతోషంతో ఎగురుతున్న పక్షులు... పక్కనే చల్లటి నీళ్ళతో పారుతున్న చిన్న యేరు. చుట్టూ వున్న తీగలకు అందమైన పువ్వులతో ఆ ప్రాంతం ఆహ్లదకరంగా ఉంది. పక్కనే ఆనుకుని ఆశ్రమం.... అందులో ఓ చెట్టుకింద స్వామీజీ కూర్చుని ఉన్నాడు. ముందు భగవద్గీత పుస్తకం వుంది. అందులోని శ్లోకాలను చదువుతూ వాటికి అర్థం వివరిస్తున్నాడు స్వామీజీ. వాటిని తదేకంగా వింటూ శ్రద్దగా మననం చేస్తూ కూర్చుని ఉన్నారు శిష్యగణం. ఏదో పౌరాణిక సినిమాలో చూసిన దృశ్యంలా కనిపించింది బంతిగాడికి. కాస్త తేరుకుని... చల్లటి నీటితో ముఖం కడుక్కుని కడుపునిండా నీళ్ళు తాగాడు. లేచి ఆశ్రమంవైపు నడిచాడు బంతిగాడు. స్వామీజీ చెబుతున్న శ్లోకం బంతిగాడి స్పష్టంగా వినిపిస్తోంది...


''పవిత్రాణాయ సాధూనాం
వినాశాయ చ దుష్కృతామ్‌
ధర్మసంస్థాపనార్థాయ
సంభవామి యుగే యుగే''


శ్లోకం చదివి దాని అర్థం ఇలా చెప్పాడు స్వామీజీ


''సాధువులను రక్షించుటకు, దుర్మార్గులను నశింపజేయుటకు మరియు ధర్మమును పున:స్థాపించుటకు ప్రతియుగమునందును నేను అవతరించుచుందును.''


దుష్టశిక్షణ, శిష్ట రక్షణ చేస్తానని ఆనాడు భగవానుడు భగవద్గీతలో చెప్పాడు. అంతేకాదు ఏ యుగంలోనైనా పాపం పండిపోతుందో అప్పుడు స్వయంగా తనే వచ్చి వీళ్ళ భరతం పడతానని భగవంతుడు చెప్పాడు... వివరిస్తున్నాడు స్వామీజీ.


''స్వామీజీ చిన్న సందేహం'' అడిగాడో శిష్యుడు.


''ఏమిటి బాబు''


''స్వయంగా భగవానుడే వచ్చి శిక్షిస్తాడా స్వామి''


''మళ్ళీ పుడతానని చెప్పాడు నాయనా''


''అంతా అబద్దం... ఉట్టిదే... మీరు చెప్పెదంతా ఉట్టిదే...నేను నమ్మను'' గట్టిగా అరిచాడు బంతి. విస్మయంగా అందరూ బంతివైపు చూశారు.

Preview download free pdf of this Telugu book is available at Sarve Janah Sukhino Bhavantu