• Sarvanga Muhoortha Sarani
  • fb
  • Share on Google+
  • Pin it!
 • సర్వాంగ ముహూర్త సారణి

  Sarvanga Muhoortha Sarani

  Publisher: Victory Publishers

  Pages: 111
  Language: Telugu
  Rating
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  '5/5' From 1 votes.
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  '5/5' From 1 premium votes.
Description

మనం ఏదైనా ఒక శుభ కార్యం తలపెట్టినప్పుడు ఆ కార్యం ఏ విఘ్నాలు లేకుండా జరగాలంటే ఆ కార్యం ఒక శుభ ముహూర్తంలో చేయాలని మన హిందూ ధర్మ శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టే మనం ఏ శుభ కార్యం చేయదలచుకున్నా దానికి శుభ ముహూర్తం మంచి పండితుని దగ్గరకు వెళ్ళి ఆ కార్యక్రమానికి తగిన దైవ ముహూర్తం పెట్టించుకుంటాము. ముహూర్తం పెట్టడం అంటే ఏ కార్యం ఎప్పుడు ఏ రోజు ఏ సమయంలో చేయాలనేది శాస్త్ర రీత్యా మంచి సమయం నిర్ణయించడమన్న మాట. అలా నిర్ణయించిన దోషరహిత శుభ సమయాన్నే ముహూర్త సమయం అంటారు.

మనం దైనందిక జీవితంలో ఎన్నో శుభ కార్యాలు చేస్తూనే ఉంటాము. ప్రతి కార్యానికి వేరు వేరు పూజలు ఎలా చేస్తామో అలాగే వేరు వేరు శుభ కార్యాలకు వేరు వేరు నిర్ణీత సమయాలు ఉంటాయి. ఆ నిర్ణీత సమయమే శుభ ముహూర్తం అంటాము. అలా దైవజ్ఞుడు నిర్ణయించిన వేళలో మనం జరిపే శుభ కార్యం నిర్విఘ్నంగా జరిగిపోతూ ఉంటుందనే వాస్తవం మనందరికీ తెలుసు.

ఏ చిన్న కార్యక్రమానికైనా మనం శుభ సమయం చూస్తాము. ఉదాహరణకు ప్రయాణాలు, క్రొత్త వస్తువుల కొనుగోలు, ఇల్లు మారటం లాంటివి. అదే కాకుండా మరిపెద్ద కార్యక్రమాలు కూడా మనం చూస్తూనే ఉంటాము. ఉదాహరణకు శంఖుస్థాపన, గృహప్రవేశం, ఉపనయనం, వివాహం లాంటివి. వీటికి కూడా తప్పకుండా మనం ముహూర్తబలం నిర్ణయించి అలా నిర్ణయించిన సమయానికి ఆకార్యక్రమం జరుపుకొని మన కార్యం దిగ్విజయమైనందుకు సంతోషిస్తాము.

ఇప్పుడు మనం ఏ శుభకార్యం ఎప్పుడు చేయాలో ఆకార్యానికి తగిన ముహూర్తం ఎలా పెట్టాలో నేర్చుకుందాము. దీనివల్ల మనకు ముహూర్త సమయం అంటే ఏమిటో ఆ ముహూర్తం ఎలా నిర్ణయించాలో అనే అంశం మీద మనకు తప్పక ఒక అవగాహన ఏర్పడుతుంది. దానివల్ల మనకు ఎవరో మిడిమిడి జ్ఞానంతో ఏదో పెట్టిన సమయమే శుభముహూర్తం అనే నిర్ణయానికి రాకుండా, వారు పెట్టిన ముహూర్తం సరియైనదా, కాదా లేక ఏవైనా దోషాలున్నాయా అని మీకు మీరే ఒకసారి పరిశీలించుకోవచ్చు. ఒక వేళ ఏదైనా అనుమానం కల్గితే మనం ఆ ముహూర్త వివరాలను పండితులను అడిగి క్షుణ్ణంగా అర్థం చేసుకొని సంతృప్తి చెందవచ్చు.

- రచయిత

Preview download free pdf of this Telugu book is available at Sarvanga Muhoortha Sarani