• Sarvadevatha Astakalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • సర్వదేవతా అష్టకాలు

    Sarvadevatha Astakalu

    Pages: 94
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

డా|| పేకేటి గీతాశివరాం గారు సంకలనం చేసిన అష్టకాలు చదివాక ఇంటింట పారాయణ గ్రంథంగా ఇది వుండటం అవసరం అనిపించింది. అష్టకాలు అనేవి భగవంతునికి – భక్తుడుచేసే స్తోత్రాలుగా ఉన్నాయి. పురాణాల్లో ఇవి దైవపరంగా వుండటం కనిపిస్తుంది. అష్టకాలు అంటే ఎనిమిది పాదాల శీర్షికలు. రెండుపాదాలు ఒక శ్లోకంగా వుండటము, కొన్ని సందర్భాలలో నాలుగు పాదాల శ్లోకాలుగా వుండటమూ, ఎనిమిది సంఖ్యలో వుండటమూ కద్దు. కొన్నిసార్లు అంతకన్నా ఎక్కువసంఖ్యలో వుండటం కూడా ఉంది. నిత్యం పఠించే అష్టకాలెన్నో ఉన్నాయి.
అష్టకంలో ప్రత్యేక విశేషాలు తెల్సుకోవాలి. ఇవి పఠించటానికి సమయం కూడా నిర్ణయింపబడింది. తెల్లవారుఝామున, తెల్లారిన తర్వాత, మధ్యాహ్న సమయం, సాయం సమయం, సంధ్యాసమయాలు, ఇలా వీటిని పఠించే పద్ధతి ఉండేది. అష్టకాలు పఠిస్తే అష్టమూర్తిగా భగవంతుని స్తుతించటం, అష్టవిధి, పూజా విధులు చేయటమే పంచభూతాలను, సూర్యచంద్రులకు జీవుని లేక పురుషోత్తముని స్తుతించుటకేనని చెప్పబడింది. ఇవన్నీ స్తుతిపూర్వకమైనవే. అష్టకాలను వివాహ సందర్భంగా చదవటం ఉంది.

కాలక్రమేణా అష్టకాలు అనేవి భగవంతుని స్తోత్రపూర్వకంగా అర్చించటమే అని రూఢి అయ్యింది. దీనివలన భగవదనుగ్రహాన్ని పొందడం జరుగుతుందని భారతీయుల విశ్వాసం. ఆథ్యాత్మికరంగంలో తనవంతు సేవను చేస్తున్న డా||శ్రీమతి పేకేటి గీతాశివరాం గారిని అభినందిస్తున్నాము.

- శ్రీ వై.ప్రభాకర శర్మ

Preview download free pdf of this Telugu book is available at Sarvadevatha Astakalu