• Sarpaghosha
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 129.6
    144
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • సర్పఘోష

    Sarpaghosha

    Author:

    Pages: 240
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మరుక్షణంలోనే ఫోన్ కనెక్టయింది.

"మీరు మన సంస్కృతిని, సంప్రదాయాల్ని సర్వనాశనం చేస్తున్నారు... దీన్ని సభ్య సమాజం అంగీకరించే స్థితిలో లేదు!" కంఠం చాలా కరుకుగా వున్నది. కోపంగా అరుస్తున్నట్లే అన్నాడు అవతల మనిషి.

శివచంద్రకు అర్థం కాలేదు అతడేం మాట్లాడుతున్నాడో కొద్ది క్షణాలవరకూ.

"ఎవరు మాట్లాడుతున్నది?" శివచంద్ర అడిగాడు తాపీగా. ఓ కంపెనీకి యజమానిగా ఆయన ఎన్నో ఢక్కామొక్కీలు తిన్న మనిషి, తొందరగా దేనికీ ఉద్రేకపడడు.

"ఉన్నత భావాలుగల ఓ భారతీయుడిని!"

"గుడ్.. నేను చేస్తున్న తప్పేమిటో చెబితే సరిదిద్దుకోవటానికి ప్రయత్నిస్తాను!" అన్నాడు శివచంద్ర.

"మీరు మనుష్యుల్ని యంత్రాలుగా భావిస్తున్నారు.... యువతీ యువకులకు బలవంతంగా పెళ్ళిళ్ళు చేయించడం... మూడు నెలలలోగా పిల్లల్ని కనాలనటం... అంటే వ్యక్తి స్వేచ్ఛను హరించటమే కదా!"

"నేనెవరినీ బలవంతం చేయలేదే... నా నిబంధనలకు అంగీకరించినవాళ్ళనే పోటీలో పాల్గొనమన్నాను!"

"అన్ని లక్షల డబ్బుని ఎరగా చూపి వాళ్ళని ఈ పోటీలోకి దింపటమంటే ఒక విధంగా బలవంతం చేయటమే... మీరు వెంటనే ఈ పోటీని విరమించుకోకపోతే పోలీసు కంప్లెయింట్ ఇవ్వటమే కాకుండా మీ ఫ్యాక్టరీ ముందు టెంట్ వేసి ధర్నా చేస్తాం... కోర్టులో కేసు వేస్తాం!"

శివచంద్ర పకపకా నవ్వాడు.

Preview download free pdf of this Telugu book is available at Sarpaghosha