-
-
శర్మ కాలక్షేపం కబుర్లు - బెల్లం కొట్టిన రాయి
Sarma Kalakshepam Kaburlu Bellam Kottina Rayi
Author: Chirravuri Bhaskara Sarma
Publisher: Self Published on Kinige
Pages: 198Language: Telugu
పెద్దలు శ్రీ శర్మ గారి బ్లాగ్ పోస్టులు అన్నీ కాకపోయినా కొన్ని ఇంతకు ముందు చదివి వున్నాను. ఏడు పదులు నిండిన వయసులో కంప్యూటర్లో తెలుగు టైపింగ్ నేర్చుకుని కాలక్షేపం కబుర్లు అంటూ శర్మగారు రాసిన కబుర్లని వట్టి కాలక్షేపం కబుర్లుగా ఎంచకుండా సత్కాలక్షేపం కబుర్లు అనడం సమంజసంగా వుంటుంది.
"నా రామాయణ, భారత, భాగవతాల చదువు, పరిశీలనకు మొదట గురువు, భిక్ష పెట్టిన వారు, నా తల్లి " అని చెప్పుకున్న శర్మగారు ఈ బెల్లం కొట్టిన రాయి అనే శీర్షికన కూర్చిన ఈ ఈ-బుక్కులో చాలా సామెతల వెనకాల కథలు వివరించారు. అంతే కాకుండా రామాయణ, మహాభారత, మహాభాగవతాల్లోని కథలూ, ఘట్టాలూ ఎన్నో వివరించారు. వీటితో పాటు భర్తృహరి సుభాషితాలను తెలుగులో అనువదించిన ఏనుగు లక్ష్మణకవి, వేమన పద్యాలను ఉదాహరిస్తూ వాటిని ప్రస్తుత కాల పరిస్థితులకు అన్వయిస్తూ ఈ తరానికి తెలియని ఎన్నో విషయాలని తేట తెలుగులో విడమరిచి చెబుతూ రాశారు.
అప్పుడెప్పుడో దాశరథిగారు రాసిన "మంచీ చెడు తెలిసి కూడా చెప్పలేనివారు ఎవ్వరికీ పనికిరారు ఏమీ చేయలేరు" అన్న ఓ సినీగీతాన్ని గుర్తు చేసుకుంటే దానికి పూర్తిగా విరుద్ధమైన స్వభావం శర్మగారిది. తనకు తెలిసిన విషయాలని తన తర్వాతి తరాలకు అర్థమయ్యేలా సరళమైన భాషలో - ఆలుమగలు ఎలా ఉండాలో, ఆడపిల్లలు ఎలా మసలుకోవాలో, ఎప్పుడు నవ్వకూడదో, ఏ సమయాల్లో ఏడవాలో - కథలోంచి కథలోకి వెళ్తూ ఒక ఇంటికి పెద్ద అయిన తాతయ్య చెప్పిన కథల్లా శర్మగారు రాసిన కాలక్షేపం కబుర్లు ఓ సాంస్కృతిక వారసత్వంగా పదిల పరుచుకోదగినవి.
- లలితా TS

- ₹43.2
- ₹43.2
- ₹43.2
- ₹43.2
- ₹43.2
- ₹43.2