-
-
సర్దార్ సర్వాయి పాపన్న
Sardar Sarvai Papanna
Author: Kompelli Venkat Goud
Publisher: Telangana Black Voice
Pages: 80Language: Telugu
భారతదేశ చరిత్రలో దళిత బిసి కుల నాయకత్వంలో దళిత బహుజనులు ఏకమై ఉద్యమిస్తే రాజ్యాధికారం సాధించవచ్చని 17వ శతాబ్దంలోనే నిరూపించిన సర్దార్ సర్వాయి పాపన్న అన్ని సామాజిక, రాజకీయ ఉద్యమాలకు ముందు వరుసలో వుండాలి. పాపన్న పోరాట నేపధ్యాన్ని నిశితంగా పరిశీలిస్తే ఏకకాలంలో అయిదు అంచెల పోరాట అంశాలు బోధపడతాయి: 1). బ్రాహ్మణ భావ జాల వ్యతిరేకత 2). సామ్రాజ్యవాద వ్యతిరేకత 3). భూస్వామ్య వ్యతిరేకత 4). బుద్దుని ఆలోచనా విధానం 5). దళిత బహుజన రాజ్యాధికారం.
భారతదేశ చరిత్రలో అన్ని రాచరిక వ్యవస్థల్లో ప్రతి రాజు, పాలకులు పూజారి వర్గాన్ని ఎవరూ నిర్లక్ష్యం చేయలేదు. పైగా హిందూమత సంప్రదాయాలను అనుసరించిన రాజులందరూ బ్రాహ్మణులకు గుడులు కట్టించి, దేవుని పేరిట మాన్యాలు కట్టబెట్టారు. పాపన్న ఇందుకు భిన్నంగా బ్రాహ్మణులకు ఎన్నడూ ప్రత్యేక స్థానాన్ని ఇవ్వలేదు. గుడులు కట్టించలేదు. అప్పటికే ఉన్న గుడుల యాజమాన్యం, పూజారి తత్వం దళిత బహుజనులకే అప్పజెప్పాడు. ఇందుకు ఖచ్చితమైన చారిత్రక ఆధారాలున్నాయి. అందుకే చరిత్ర రచన తమ గుప్పెటలో పెట్టుకున్న బ్రాహ్మణ సమాజం పాపన్న చరిత్రను నిర్లక్ష్యం చేసింది. దళిత బహుజన కళాకారులను ఆదరించాడు కనుకనే జానపదులు పాపన్న జీవితాన్ని ప్రజల హృదయాలలో తమ కళా రూపాల ద్వారా నిక్షిప్తం చేశారు. తెలుగు ప్రాంతాన్ని పాలించిన రాజులలో బ్రాహ్మణ ఆధిక్యాన్ని ఎదురించి నిలిచిన ఏకైక వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న.
