-
-
సరస్వతీదేవి, పార్వతీదేవి - దుర్గాదేవి
Saraswatidevi Parvatidevi Durgadevi
Author: Ramakrishna Math
Publisher: Ramakrishna Math, Hyderabad
Pages: 226Language: Telugu
సరస్వతీ దేవి ఆదిశక్తి యొక్క వాక్-బుద్ధి-విద్యా జ్ఞానాలకు అధిష్ఠాత్రి. ఈ దేవి అనుగ్రహం కలిగిన మానవులు జ్ఞానసంపన్నులవుతారు. పరబ్రహ్మ శక్తి స్వరూపాన్ని తెలుసుకోడానికి అత్యంత సూక్ష్మమైన, సునిశితమైన బుద్ధి అవసరం. ఈ వాగ్దేవిని స్తుతిస్తే మేధాశక్తి ప్రచోదించబడుతుంది.
ఈ పుస్తకంలో పొందుపరిచిన స్తోత్రముల ద్వారా తల్లిని స్తుతించి, ఆమె కృపకు పాత్రులై, విద్యార్థులు, జ్ఞానార్థులు, ఆస్తిక మహాశయులు సర్వోత్కృష్టమైన జ్ఞానాన్ని ప్రాప్తించుకోగలరని ఆశిస్తున్నాము.
సర్వ దేవీదేవతల శక్తి స్వరూపమే దుర్గాదేవి. 'దుర్గ' అంటే సమీపించ సాధ్యంకానిది అని అర్థం. ఈ తల్లి సృష్టి-స్థితి-లయకారిణి. మనం కామ క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య, దంభ, దర్ప, అహంకార, అభిమానాది అసురీ శక్తులను నిర్జించాలంటే అమ్మ అనుగ్రహం కావాలి. ఆమె కృప కలిగితేనే మనం ఈ అసురీ శక్తులపై విజయం సాధించి శాశ్వత శాంతిని పొందగలం
పార్వతీదేవి కూడా జగన్మాత స్వరూపమే. పార్వతీదేవీ దుర్గాదేవి... రెండూ ఒకే శక్తి యొక్క భిన్ననామాలూ, రూపాలూనూ. మనస్సును జయించాలంటే ఏదో ఒక రూపంలో ఈ తల్లులను పూజించి ప్రసన్నం చేసుకోవాలి. ఈ చిన్ని పుస్తకంలో స్వామి హర్షానంద ఆంగ్లంలో రచించిన "దేవి - ఆమె అంశలు" అన్న పుస్తకం నుండి ఈ స్త్రీరూప శక్తి ఉపాసన వెనుక గల తత్త్వాన్ని, సాధకుల సౌలభ్యార్థం, తెలుగులోకి అనువదించి, గ్రహించడమైనది.
- ప్రకాశకులు

- ₹129.6
- ₹180
- ₹60
- ₹72
- ₹81
- ₹81
- ₹270
- ₹129.6
- ₹108
- ₹180
- ₹270
- ₹108