-
-
సరస్వతీ సంహారం
Saraswathi Samharam
Author: Puttaparthi Narayanacharyulu
Publisher: Self Published on Kinige
Pages: 90Language: Telugu
''ఓహో ! అదేమి పెద్ద విషయం ! మొన్న మన బాళప్ప పురోహితుల యింట్లో మిళ్ళి గరిటె యెత్తికొనివచ్చి మా దొడ్డిలోని బావిలో దబుక్కున పడవేశాడు''.
తరుముకుంది గౌరమ్మ గోదావరమ్మను మాటలతో ! తోళప్పళాచార్యుల భార్య శ్రీరంగమ్మ తన దినపత్రికలోని వార్తలను విప్పింది. తనవలె మరెవ్వరూ కన్నడం మాట్లాడలేరనేంత వరకూ ఆమె వూహ ! శ్రీరంగమ్మ అన్నది ''అదే వూళ్లోనో ముగ్గురు రైతులు పెద్దపులిని కేవలం కట్టెలతో గొట్టి చంపేశారట !''.
''భలే విషయం చెప్పావులే ! నిన్న మన బాళప్ప ఆడుతూ ఆడుతూ బాజాసాబుగారి మేకకాలే విరగగోట్టాడు'' గౌరమ్మ పౌరుషంతో యెద విరుచుకుంది.
తులశమ్మ వూరికే వుండబట్టలేదు. ఆమె లొట్టలు వేసికొంటూ ''గౌరమ్మా ! యీ మాట విన్నావా? మొన్న బొంబాయి సర్కసులో ఒక పిల్ల చేతులు విడిచిపెట్టి తంతిపైన ఆడిందటగా !'' అన్నది.
ఇతరులకు సంక్రమించిన యీ కీర్తిని గౌరమ్మ దక్కనిస్తుందా !
నీవు మా బాళప్ప జేసేది చూడలేదులే ! నిన్న వాడు గోడకు కొట్టిన గూటముపైన గోడపట్టుకోకుండానే లేచినిలబడినాడు''. ఏ మాత్రం తడుముకోకుండా ఉత్తరమిచ్చింది గౌరమ్మ.
“కాఫీకి ప్రొద్దయిందమ్మా ! వస్తాను” శ్రీరంగమ్మ పైట సర్దుకుని “పోదువు కూచోవమ్మా ! నీ వొచ్చేదే అపురూపం“ తులశమ్మ ఆగ్రహించింది.
“మా మగవారొచ్చే పొద్దయింది” అంటూ తన కన్నడ భాషా పాండిత్యాన్ని చూపించి శ్రీరంగమ్మ పోనేపోయింది.

- ₹270
- ₹378
- ₹72
- ₹108
- ₹216
- ₹72