• Sarasarasa
  • fb
  • Share on Google+
  • Pin it!
 • సరసరస

  Sarasarasa

  Pages: 272
  Language: Telugu
  Rating
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  '5/5' From 1 votes.
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  '0/5' From 0 premium votes.
Description

మనది హిందూ దేశము కాదు, హిందూ మతమూ కాదు. అరబ్బులు ‘సింధూ’ నదిని హిందూ అనే అంటారు. అంటే సింధూ నది ప్రవహించే దేశమగుటచే వారు దీనిని సింధూ దేశముగా తలచి హిందూ దేశముగా పలికినారు. అసలు సింధువునకు ‘సముద్రము’ అన్న ఒక అర్ధము వున్నది. మన దేశమునకు మూడు దిక్కులా సముద్రమే గదా వుండేది. కావున కొంత, మన దేశ నామమునకు సమంజసతనాపాదించుకొనవచ్చును. కానీ మన పూర్వులు ఏర్పరచిన 'భరత దేశము’ అన్నపేరు అప్రతిహతము, అమేయము. ‘భ’ అన్న శబ్దమునకు ‘వెలుగు’ ‘ప్రకాశము’ ఇత్యాది అర్థములే గాక ‘అభివృద్ధి’ అన్న అర్ధము ఉన్నదని ఒక మహా పండితుడు నా బాల్యమున చెప్పగా విన్నాను. వారి అభిప్రాయమును పుష్టి చేస్తూ క్రింద రెండు మూడు ఉదాహరణలు మనవి చేసుకొంటాను. ఈ పదములను గమనించండి : 1. నభము, 2. శుభము, 3. ప్రభ, 4. సభ, 5. భగము. నభము అన్న మాటకు ఆకాశము అని అర్ధము. 'ఆకాశం గగనం శూన్యం' అన్న నానుడి మనకు తెలిసినదే. 'నభ’ము=’అ’+’భ’ ము. ‘అ’ లేనిది అని అర్థము ‘భ’ అంటే ‘అభివృద్ధి’ అని చెప్పుకొన్నాము. కావున నభము అంటే అభివృద్ధి లేనిది అని అన్వయము. అది వాస్తవమే కదా! ‘శుభ’ అన్న శబ్దమునకు సదభివృద్ధి (సు=ఉత్తమ: భ=అభివృద్ధి) అన్న అర్ధమును తీసుకొనవచ్చును. ప్రభ అన్న మాటకు వెలుగుతో కూడినది అని అనుకొన్నా రాణించుట అన్న అన్వయములో కూడా వాడుతారు. రాణింపు అభివృద్ధియే కదా! మిగతా రెండు కూడా అదేవిధముగా అన్వయించుకొనవచ్చును. ఇక ‘భగ’ము అన్న మాటను మాత్రము కాస్త విశ్లేషించుతాను. ఇది మన కన్న తల్లుల మర్మాంగము. ‘భ’ అంటే అభివృద్ధి అని చెప్పుకొన్నాము. అట్లే ‘గ’ అంటే ‘గమనము’ అంటే ‘నడచుట’ అంటే అభివృద్ధి వైపు నడచుట, అంటే పురోభివృద్ధి. మరి సంతానము సంసారమునకు పురోభివృద్ధియే కదా! కుటుంబము విస్తరిల్లవలె నంటే ఈ శరీరాంగమే కదా నిర్గమ ద్వారము. ఇచట నేను పురాణముల జోలికి పోలేదు, ఆ పేరు ఏ రాజు మూలమున వచ్చినది అని. రాజు ఎవరైనా కానీ దేశమునకు చేసిన నామకరణము ఎంతటి మాన్యత కలిగినదో గమనించండి. అంతటి పేరు ప్రసాదించిన మన పూర్వులు ఎంతటి మహనీయులన్నది ఆలోచించండి.

పై వివరణ వల్ల తెలిసినది ఏమిటంటే మనవారు ప్రతి విషయములోనూ ఎంతో శ్రద్ధ దీక్ష కనబరచినారు అన్నది. వారి ఔన్నత్యమును గుర్తించి, వారిని గురించి మీకు కూడా తెలిపే ప్రయత్నమే ఈ పుస్తకము.

- చెరుకు రామ మోహన్ రావు

Preview download free pdf of this Telugu book is available at Sarasarasa