-
-
సరదాకి
Saradaki
Author: Mangu Rajagopal
Publisher: Sahaja Publications
Pages: 388Language: Telugu
ఆంధ్రజ్యోతి ఆదివారపత్రిక - సండే బుఫే బ్రేక్ఫాస్టు స్ప్రెడ్ జన్-పసంద్- తెలుగు సినిమా ఐటమ్సులా పప్పూ కూరలూ పచ్చళ్ళూ పొడుములూ పులుసూ చారూ పెరుగూ స్వీటూ హాటూ పండూలతో సర్వజనరంజకంగారుగా ఉంటుంది. కథలూ కాకరకాయలూ, బుజాలు తడుముకోవడానికి గుమ్మడికాయలూ, పెసరట్టులూ గళ్ళనుడికట్టులూ ప్రివ్యూలూ రివ్యూలూ వేదాంతబాధలూ శృంగారగుళికలూ పిల్లల గోళీలూ వైకుంఠపాళీలూ పోళీలూ లేడీస్ చోళీలూ ఇలా కైలడోస్కోపిక్ విందు. అందులో రాజగోపాల్గారి 'సరదాకి' ఒక హైలైట్. ఇందులో యింపైన నవ్వింపులు ఖద్దరు ఉప్మాలో ఉదారంగా వెదజల్లిన జీడిపలుకుల్లా - కంటికింపుగా పంటికి విందుగా దిల్పసందుగా ఉంటాయి. తాలింపులో ఆవాల్లా పంచ్ లైనులు చిటాపటా పేలుతుంటాయి. సుతిమెత్తగా చెంపలు నిమురుతూ చుర్రున గిల్లుతాయి. కస్సుమని కరుస్తాయి. ఛెళ్ళున కొడతాయి - మిమ్మల్ని కాదు! చదివెడువాడికీ చదివించెడువాడికీ ‘సరదా’గానే ఉంటున్నా చదవబడే-భాయిలకీ, బడా బాబులకీ మాత్రం ఈ సరదా కబుర్లు జరదా కిళ్ళీల్లా గూబలదరేస్తాయి.
- రమణ
