• Saptasaptati Gnanodaya Mandaramu Mudava Bhagamu - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • సప్తసప్తతి జ్ఞానోదయ మందరము - మూడవ భాగము (free)

    Saptasaptati Gnanodaya Mandaramu Mudava Bhagamu - free

    Pages: 616
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఇది సప్తసప్తతి జ్ఞానోదయ మందరము మూడవ భాగము

శ్రీమద్రామాయణం ఒక మహా కావ్యము. కావ్యమే కాక ఇతిహాసము అనగా చరిత్ర అని కూడా రామాయణానికి ప్రసిద్ధి కలదు. శ్రీమద్రామాయణం ఏ దృష్టితో చూసినచో, ఆ దృష్టికి అనుగుణముగా రామాయణములోని అనేక విషయములు మనకి అవగతమవుతూ వుంటాయి. శాస్త్ర దృష్టితో చూసినచో రామాయణము అనేక శాస్త్రములకు అలవాలము. కావ్య దృష్టితో చూసినచో కావ్యములోని అనేక సంగతులు శ్రీమద్రామాయణం నందు గోచరించును. భాషాపరమైన దృష్టితో చూసినచో, సంస్కృత భాషలోని అనేక చమత్కారములు రామాయణము నందు ప్రేక్షకులకు, వీక్షకులకు గోచరించును. రాయణమును చారిత్రక పరముగా చూసినచో నాటి సామాజిక, ఆర్థిక, పౌరాణిక, రాజకీయ విషయములు అనేకము రామాయణము నందు గోచరించును. కనుక రామాయణమును ఏ దృష్టితో చూసినచో, ఆ దృష్టికి అనుగుణమైనటువంటి అనేక రహస్య విషయములను రామాయణములో ప్రక్షేపించటము రామాయణము గ్రంథ కర్త అయిన వాల్మీకి వారి యొక్క విశిష్టత. వాల్మీకి వారు మహా పండితుడు, మహా కవి. అది కవి, చరిత్ర విశ్లేషకుడు మరియు నాటి అనేక శాస్త్రముల యొక్క ఉద్గాత. ఈ విధముగా వాల్మీకి వారు తమ యొక్క ప్రతిభతో రామాయణమును రచించుట, ఆ రామాయణము చిరకాలము కూడా నిలిచివుండుటకు తార్కాణము.

ప్రస్తుతము మన 'సప్తసప్తతి జ్ఞానోదయ మందరము' రచయిత రామాయణమును. రామాయణములోని పాత్రలను కుండలినీ శక్తికి అనుబంధముగా విచారణ చేయుట జరిగినది. ఈ విధముగా కుండలినీ శక్తిని ఉత్తేజ పరుచుటకు రామాయణములోని పాత్రలు అందరూ కూడా సాక్షీభూతులుగా వుండటము, ఆ స్థాయికి చేరటము రామాయణములోని పాత్రల యొక్క విశేషత్వాన్ని గురించి రచయిత తనయొక్క ప్రతిభను వ్యక్తపరిచారు. ఈ విధముగా విష్ణుగ్రంధి. బ్రహ్మగ్రంధి, రుద్రగ్రంధి - ఈ మూడింటి యొక్క అనావరణము ద్వారా కుండలినీ శక్తిని మేల్కొల్పి, జ్ఞానమును గ్రహించుట అనే విషయములో వీరు గొప్ప సాధన చేసి, ఆ సాధనను రామాయణములోని అన్ని పాత్రలలోనూ ప్రతిపాదిస్తూ రామాయణము మొత్తమూ కూడా కుండలినీ యోగము యొక్క సారముగా, కుండలినీ యోగ రహస్యాలను వారు అన్వేషిస్తూ, బహిర్గతము చేస్తూ ఈ 'సప్తసప్తతి జ్ఞానోదయ మందరము' యొక్క పాఠకులకు తనదైన శైలిలో కుండలినీ శక్తిని గురించి చక్కగా వివరించారు.

- డా. మల్లంపల్లి మల్లికార్జున రావు

గమనిక: "సప్తసప్తతి జ్ఞానోదయ మందరము - మూడవ భాగము" ఈబుక్ సైజు 6 mb