• Sankhya Sastram
  • Ebook Hide Help
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • సంఖ్యా శాస్త్రము

    Sankhya Sastram

    Publisher: Victory Publishers

    Pages: 69
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ జగత్తు గురించి మనము విజ్ఞానపరంగా ఆలోచిస్తే మనకు మొట్టమొదట మన మేధస్సుకు అందే విషయం ఏమిటంటే ప్రతి అంశం కూడా ఒక నిర్ణీత సమయానికి మరియు నిర్ణీత వేగానికి కట్టుబడి ఉందని అర్థమవుతుంది. ఈ ప్రకృతి ధర్మములో ప్రతిదానికి ఒక నిశ్చయమైన గణితసూత్రం మూలంగానే అవి జరుగుతున్నాయని మనకు తెలుస్తుంది. ఎందుకంటే రాత్రి పగలు, అమావాస్య పౌర్ణమి, ఋతుపవనాలు, సూర్యచంద్ర గమనాలు అన్ని కూడా గణిత సూత్రానికి మరియు కాలసూత్రం మీద ఆధారపడియున్నాయి. మనకు కనబడే సూర్యచంద్రులే కాక మనకంటికి కనపడని మిగిలిన ఎన్నో గ్రహాలు కూడా ఒక నిర్దుష్టమైన వేగపరిమితి మరియు కాల పరిమితి అనుసరించే తమ కక్ష్యలో పరిభ్రమిస్తూ యుంటాయి. అంటే వాటి గణితసూత్రాల ప్రభావం వల్ల మనకు ఈ భూమి మీద ఎటువంటి ప్రభావము చూపుతోందా అని ఆలోచిస్తే, వాటి వల్ల మానవ జీవితస్రవంతి లోని భూత, వర్తమాన, భవిష్యత్తులకు అవే మూల కారణాలని మన మహాఋషులు, మరియు మహా జ్యోతిష పండితులు అయిన నారద మహర్షి, వరాహమిహిరుడు, పరాశరుడు, మంత్రేశ్వరుడు, జైమిని మొదలగువారు ఉద్ఘాటించారు.

గణితసూత్రాలకు మూలం సంఖ్యలు అని మనకు తెలుసు. అవి ఒకటి నుండి తొమ్మిది వరకు అని కూడా తెలుసు. ఇలా సంఖ్యలు వ్రాసుకుంటూ పోతే దానికి అంతులేదు. పైగా అనిశ్చిత పరిస్థితి ఏర్పడి అంతా అయోమయంగా ఏర్పడుతుంది. అలాంటి పరిస్థితి ఏర్పడకుండా ఉండటానికి మన పూర్వులు ఎంతో మేధో సంపత్తు మరియు ఎంతో అనుభవముతో ఈ ప్రపంచానికి అత్యంత విలువైన ఒక సంఖ్యను ఏర్పరచి దానిని మానవాళికి అర్పితం చేశారు. ఇది మన భారతీయులకు మంచి గర్వకారణం. అదే పూర్ణబిందువు. తరచుగా సున్న అని అంటాము. ఈ సంఖ్య వ్రాయటం వల్ల ఎన్ని కోట్ల నంబర్లయినా ఈ సున్నా సహాయముతో మనం వివరించవచ్చు. అంతులేని ఎన్ని సంఖ్యలైనా ఎందుకు వ్రాయగలమంటే ఈ 'సున్నా' అనే సంఖ్యకు అంతము అనేది ఉండదు. అంటే మిగిలిన సంఖ్యలు అన్నిటికి ఒకటి నుండి తొమ్మిది వరకు ఆరంభము అంత్యము కలవి. కాని సున్నా మాత్రం '0' ఆరంభించిన తర్వాత అంత్యము ఆరంభముతో కలిసి ఆరంభ అంత్యములు లేకుండ యుంటుంది. ఇలా అంత్యము, ఆరంభము లేని సంఖ్య కాబట్టే అనంతమైనట్టి కోట్లానుకోట్లు సంఖ్యలను సున్నాను ఉపయోగించి వ్రాయవచ్చు. 'సున్న' కనిపెట్టిన మన పూర్వులు ప్రపంచానికే గణితశాస్త్రాన్ని బోధించి మానవులందరికీ గురువులుగా భాసిల్లినారు.

ఒకటి నుంచి తొమ్మిది అంకెల వరకు మూల సంఖ్యలు అంటాము. అలాగే సున్నాను కూడ ఒక సంఖ్యగానే పరిగణించి దానిని కూడ ఒక మూల సంఖ్యగానే తీసుకోవాలి. అంటే అన్ని సంఖ్యలతో పాటు సున్నా కూడా మిగిలిన సంఖ్యలలో భాగమే కాబట్టి ఈ సున్న మూల సంఖ్యగానే తీసుకోకోవాలి. దీనివల్ల ఒకటి నుండి పదివరకు ఎవరైనా సంఖ్యలు నేర్చుకుంటే వారు ఎన్నికోట్ల సంఖ్యలైనా సులువుగా వ్రాయగలరు. మనము ఎన్ని సంఖ్యలు వ్రాసినా ఆ సంఖ్యలను కలిపి ఒకటిగా చేస్తే అది మరలా మూలసంఖ్యే అవుతుంది. మనం గమనించవలసింది ఏమంటే మన భాషలలోని అక్షర సముదాయానికి కూడా మూలసంఖ్యలు ఏర్పరచారు. దీనివల్ల ప్రతి ఒక్క అక్షరానికి ఒక్కొక్క సంఖ్యను ఏర్పరుచుట వల్ల భాషను పట్టి గూడ మూలసంఖ్యలు కనుగొనవచ్చు. కాబట్టి మనపేరులోని అక్షరాల ప్రకారం సంఖ్యలను తీసుకొని ఆ సంఖ్యలన్ని కలిపి మూలసంఖ్యలను కనుగొంటే ఆ మూలసంఖ్య ప్రకారం అంతరిక్షంలోని గ్రహాల పేర్లను మనం కనుగొనవచ్చు. ఎందుకంటే భాషలోని అక్షరములు మాదిరిగానే ఆకాశంలో ఉన్న గ్రహాలకు కూడ ఒక నిర్ధిష్టమైన సంఖ్య ఇవ్వబడింది. కనుక అక్షరముల సంఖ్యలతో గ్రహాల సంఖ్యలను పొందిక చేస్తే మనం గ్రహాలు ఇచ్చే ఫలితాలను విశ్లేషించవచ్చు.

Preview download free pdf of this Telugu book is available at Sankhya Sastram