-
- A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
-
శంకర శతకము - రివైజ్డ్ (free)
Sankara Satakamu Revised - free
Author: Kandi Shankaraiah
Publisher: Sankarabharanam Prachuranalu
Pages: 34Language: Telugu
తెలుగు సాహితీ జగత్తులో పద్యం ఒక సమున్నతమైన ప్రక్రియ. అలాంటి పద్యానికి పట్టం గట్టి, "శంకరాభరణం" బ్లాగు, వాట్సప్ సమూహం, ముఖపుస్తకం ద్వారా ఎందరినో పద్య కవులుగా తీర్చిదిద్ది నిరంతర పద్య సాధనకులుగా మారుస్తూ, వారి పద్య రచనా శక్తికి మరిన్ని మెరుగులు పెట్టిస్తూ, నిరంతరాయంగా పద్య రచనా ప్రక్రియను అనుదినమూ ప్రపంచానికి పరిచయం చేస్తూ, తెలుగు పద్య సాహిత్యానికి ఎనలేని సేవ చేస్తున్న మహోన్నతులు శ్రీ కంది శంకరయ్య గారు. వారు మహాశివరాత్రి పర్వదినంనాడు సంకల్పించి, వెలువరించిన మహత్కృతి ఈ "శంకర శతకము".
ఈ శతకం మహోన్నతమైన భక్తి భావ పరిమళభరితంగానూ, సత్పదౌచిత్యయుత వాక్య విన్యాస విలసితంగానూ, ధారాళమైన నడకతోనూ, అద్యతన కవులకు మార్గదర్శకంగానూ, సుకవి పండితులు మెచ్చి, తలలూచే విధంగానూ, నిర్దుష్టంగానూ, నిర్దిష్టంగానూ రూపుదిద్దుకొన్నది. శ్రీ శంకరయ్య గారిలోని కవిహృదయం శివసాన్నిధ్యం కోసం తపిస్తూ, శివకరుణా కటాక్షాన్ని ఆశిస్తూ, స్వీయ హృదయావిష్కృత భక్తి విశేషమును తన విన్నపాల ద్వారా, ఆ భోళా శంకరుని మనస్సు కరుగునట్లుగా ప్రగాఢంగా, ప్రస్ఫుటంగా, హృదయంగమంగా అర్థించడం మనకు ఈ శతకంలోని ప్రతి పద్యంలోనూ కనిపించే గొప్ప విశేషం.
- గుండు మధుసూదన్

- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE