-
-
శంకర దాస అష్టోత్తర శతి
Sankara Dasa Ashtottara Sati
Author: Cheruku Rama Mohan Rao
Publisher: Self Published on Kinige
Pages: 115Language: Telugu
Description
శంకలు వేన వేలు గళ శల్యములై నను బాధపెట్ట, నే
బింకము మాని నిన్ను నెద బిందువుగా నొనరించి మ్రొక్కెదన్
పొంకము తోడ నన్నుగొని పోరిమితోడ పరిష్కరించి, ఈ
సంకులమౌ సమస్యలను సాంతము బాపుము లోకశంకరా!
*****
ఎన్నకు నాదు తప్పులను ఎన్నకు ఒప్పులు కూడ ఏలనన్
ఉన్నవి తప్పులే అసలు ఒప్పులు ఉండగ నేరవయ్యరో
పన్నగ భూష ! సంద్రమున పానము చేసేడు నీరు కల్గునా
యున్నటువంటి వాస్తవము నున్న విధాన గ్రహించు శంకరా!
*****
ఎల్లలు లేవు నా మదికి ఏ దిశ కోరిన యట్లు దా జనున్
కల్లలు కావు మాటలివి గాలిని బోలు, న దెల్ల వేళ, తా
చిల్లరమల్లరౌ పనులు చేయగ జేయుచు చేసె బంటు న
న్నల్లరి మానసం, బదెటు ఆడక నిల్పెదవయ్య శంకరా !
Preview download free pdf of this Telugu book is available at Sankara Dasa Ashtottara Sati
Login to add a comment
Subscribe to latest comments
