-
-
సంజీవదేవ్ జీవనరాగం
Sanjeev Dev Jeevana Ragam
Author: Ravela Sambasiva Rao
Publisher: Tenali Prachuranalu
Pages: 208Language: Telugu
రావెల సాంబశివరావు తను అందించదలచిన పుస్తకానికి కావల్సిన అంశాలను సంజీవదేవ్ రచనల్లోంచి, లేఖల్లోంచి, ముచ్చట్ల నుంచి, మౌనంలోకి సంగ్రహించి గ్రహించి జీవనరాగంగా శ్రుతిలయలు తప్పకుండా పొదిగారు. "పొదగడం"తో ఎవరికైనా శ్రమ, శ్రద్ధ వున్నప్పుడే ఫలితం వుంటుంది. ఏరిన ముత్యాలను తన వాక్యాల జిగినీ గొలుసుతో సర-పరిచారు. చదివాక 'రా.సా.రా' యింత చక్కగా రాశారా అని అభినందిస్తారు మీరంతా. సంజీవదేవ్ని సంపూర్ణంగా చదివిన వారిని యీ రచన ఆత్మీయంగా స్పృశిస్తుంది. చదవని వారికి స్వాగత తోరణం అవుతుంది. సంజీవదేవ్ సమగ్ర సాహిత్యానికి యిది పీఠికగా నిలుస్తుంది.
- శ్రీరమణ
ఈ 'సంజీవదేవ్ జీవనరాగం' ఆలపించిన రావెల సాంబశివరావు సంజీవదేవ్ బాటన నడుస్తున్న భావుకుడు. మాలాంటి వాళ్ళకెందరికో ఆత్మీయుడైన సంజీవదేవ్ను 'సంజీవనరాగం' మరెందరికో ఆత్మీయుడిగా మారుస్తుందనుకుంటున్నాను. ఈ పుస్తకం చదివి మరెందరో నవ యువతీయువకులు సంజీవదేవ్ సాహిత్యం చదవాలని ఉబలాటపడితే మాకన్నా ఎక్కువగా సంతోషించేవాళ్లు మరెవరూ ఉండరు.
- వాడ్రేవు చినవీరభద్రుడు
