-
-
సంగీతం రీతులు - లోతులు
Sangeetam Reetulu Lotulu
Author: Kodavatiganti Rohini Prasad
Publisher: Hyderabad Book Trust
Pages: 222Language: Telugu
సంగీతం గానీ, సాహిత్యం గానీ మరేదయినా గానీ పరిచయం పెరిగినకొద్దీ బాగా అర్థమవుతుంది. వాటిలోని లోతులు రాను రాను తెలుస్తాయి. ఇక రోహిణీ ప్రసాద్ లాంటివారు ప్రక్కన నిలబడి, "ఇదిగో! ఈ వివరం చూడు" అని చెప్పారనుకోండి, రుచి మరింత సులభంగా తెలుస్తుంది. శాస్త్రీయ సంగీతం గురించి, సులభ పద్ధతిలో చెప్పేవారు లేకనే, అది చిటారు కొమ్మన మిఠాయి పొట్లంలా మిగిలింది. రోహిణీ ప్రసాద్ రాసిన ఈ వ్యాసాలు మిఠాయిని కిందకు దించి అందరికీ పంచుతాయి.
రోహిణీ ప్రసాద్ శాస్త్రజ్ఞుడు, సాంకేతిక నిపుణుడు. సంగీత సాహిత్యాలలో లోతయిన అనుభవం గల మనిషి. స్వయంగా సితార్ విద్వాంసుడు, రచయిత కూడానూ. శాస్త్రీయ దృక్పథంతో సంగీత విషయాలను విశ్లేషించి, సులభమయిన మాటల్లో చెప్పడం ఆయనకు బాగా కుదిరింది. సినిమా పాటల గురించి రోహిణీ ప్రసాద్ అందించిన విశ్లేషణలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. సినిమా పాటలంటే ఏముందిలే అనుకున్నవారికి, పాటలోని కనబడని లోతులను చూసేందుకు చక్కని మార్గం చూపించారు ఈ రచయిత.
- కె. బి. గోపాలం
