-
-
సంగీత ప్రపంచం
Sangeeta Prapancham
Author: Dr. K. V. Rao
Publisher: Self Published on Kinige
Pages: 202Language: Telugu
'సంగీత ప్రపంచం' పుస్తకాన్ని రచించాలనేది నా చిరకాల వాంఛ. కొన్ని సంవత్సరాల కృషి ఈనాటికి ఫలించింది.
గ్రామఫోన్ అన్నా, గ్రామఫోన్ రికార్డులన్నా నాకు ప్రాణం. కనుమరుగవుతున్న గ్రామఫోన్, వాటి రికార్డుల చరిత్రను తెలియచేయాలనే ఉద్దేశ్యమే ఈ పుస్తక ప్రచురణకు స్ఫూర్తి. ఏమి సౌకర్యాలు లేని రోజులలో ఎందరో మహానుభావులు శబ్దాన్ని రికార్డు చేసి, నిల్వ ఉంచే పద్ధతులను తిరిగి ఆ శబ్దాన్ని వినే యంత్రాలను, సినిమా ప్రొజక్టర్లను అహోరాత్రులు శ్రమించి పరిశోధనలు చేసి కనుగొన్నారు. వారి కృషి ఫలితాన్ని మనము ఈనాడు అనుభవిస్తున్నాము, ఆనందిస్తున్నాము. కాని వారిని మనము తలుచుకోము, గుర్తుంచుకోము. వారిని గురించి తెలుసుకునే ప్రయత్నము కూడా చేయము.
అలాగే సంగీతానికి పునాదులు వేసి దినదినాభివృద్ధికి ఎందరో కళాకారులు శ్రమించారు.
ఆనాటి దేశ సంస్కృతీ సంపదలను ఈనాడు కూడా అందుబాటులో ఉంచే ప్రయత్నంలో ఎన్నో రికార్డింగ్ సంస్థలు (ఆడియో, వీడియో), ఇతర మాధ్యమాలు ఎంతో శ్రమిస్తున్నాయి.
ఈ సంస్థలు సాహసించి ఈ ప్రయత్నాలు చేయకపోతే ఆనాటి స్వర్గయుగ సంగీతముతో బాటుగా అనేక అద్భుత చిత్రాలను, వాటిలో నటించిన నటీనటులను, తెర వెనక ఉండి నడిపించిన నిర్మాతలను, దర్శకులను, రచయితలను, సంగీత దర్శకులను, గాయనీ గాయకులను, టెక్నీషియన్స్‌ను ... ఇలాగ ఎందరినో శాశ్వతముగా మరచిపోయే ప్రమాదము ఉండేది. ముందు తరాల వారికి ఆనాటి వారి యొక్క గొప్పతనాన్ని తెలియచేసే అవకాశముండేదికాదు.
ఇంతటి గొప్ప చరిత్రను సృష్టించిన మేథావులందరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఆ మహానుభావులను ఈ పుస్తకము ద్వారా పాఠకులు ఒకసారైనా తలుచుకునే అవకాశము కలుగుతుందని ఆశిస్తున్నాను.
- డా॥ కె.వి.రావు
