-
-
సంధ్యారాగం
Sandhyaragam
Author: K. Vasavadatta Ramana
Publisher: Self Published on Kinige
Pages: 85Language: Telugu
'' పద్మనాభరావుగారు కబురు పంపారు పిల్ల నచ్చిందనీ, కట్నం మటుకు లక్ష సరిపోదు, లక్షన్నర అయితే మాట్లాడుకుందాం రండి అని'' మావయ్య అన్నాడు.
అత్తయ్య ఒప్పుకోలేదు, ''అంతా పెద్దదానికే ఊడ్చేస్తే, చిన్నది పద్మిని సంగతేంటి?'' గొడవ చేసింది గట్టిగా! మావయ్య ఆలోచనలో పడ్డాడు.''అబ్బాయి బావున్నాడు, స్టేటస్ బావుంది. తెనాలి అంటే దగ్గరే కదా!'' రత్న సన్నాయి నొక్కులు నొక్కింది.
అందరూ తేల్చుకోలేని పరిస్థితిలో నేనే నిర్ణయాన్ని ప్రకటించాను.
''అత్తయ్య, మావయ్యా!'' ముందు రత్న సంగతి చూద్దాం! పద్మిని ఇంకా చిన్నది, తను ఒప్పుకుంటే నేనే చేసుకుంటాను, కాదంటుందా, తన పెళ్ళి ఓ నాలుగేళ్ళు తర్వాత నేను సంపాదించి మంచివాడ్ని చూసి
చేస్తాను. సరా!''
మావయ్య సంతోషించాడు నా మాటలకి. అత్తయ్య అయిష్టంగానే ఒప్పుకుంది. రత్న ముఖం వికసించింది, మావయ్య వెళ్ళి మాట్లాడి వచ్చాడు. మా ఇంట్లోనే నాలుగు రోజుల తర్వాత తాంబూలాలు పెట్టుకున్నారు. అందరి మనసులు కుదుటపడ్డాయి.
''థ్యాంక్స్ బావా!''
రత్న ఆ సాయంత్రం మేడమీద పుస్తకం చదువుతుండగా వచ్చి అంది. నేను ఆశ్చర్యపోయాను. ఆ రోజు
తర్వాత ''రత్న'' నాతో డైరెక్టుగా మాట్లాడడం ఇదే మొదటిసారి!
Very nice story