-
-
సంధ్యా రాగం
Sandhya Raagam
Author: Dr. M.V.Ramana Rao
Publisher: Andhra Pradesh Sahitya Samskrutika Samakhya
Pages: 242Language: Telugu
డా. రమణారావు గారి పఠనాసక్తికీ, పరిశీలనాశక్తికి నిలువుటద్దం ఈ సంధ్యారాగం. వారి విశ్లేషణా చణత్వం ప్రస్ఫుటంగా పాఠకులకు విశదీకరించే పరిశోధనా గ్రంథం ఈ సంధ్యారాగం. సంప్రదాయ సాహిత్యమో, ఆధునిక సాహిత్యమో, పాశ్చాత్య సాహిత్యమో, యాత్రా సాహిత్యమో, సృజనాత్మక సాహిత్యమో ఇలా ఏదో తమ అభిమాన రంగం ఎంచుకుని రచయితలు అందులో లోతులకి దిగి, అనర్ఘ రత్నాలను ఏరి పాఠక లోకానికి పరిచయం చేయడం సాధారణ విషయం. కానీ డా. రమణారావు గారు అన్ని సాగరాలను మధించి మరకతాలూ మాణిక్యాలూ ఈ సంధ్యారాగంలో మనకు అందించారు.
రచయిత ఈ వ్యాసాలలో కాళీదాసు కుమార సంభవాన్ని ఎంత విశ్లేషణాసక్తితో పరిశీలించారో ఫ్రెంచి భాషలోని ఫోనెటిక్స్ కూడా అంతే సమన్వయ శక్తితో వివరించారు. నన్నెచోడుని కవిత్వాన్నీ, శతక వాజ్మయాన్నీ ప్రతిభావంతంగా విశ్లేషించిన వారి కలం, ఇంగ్లీషు సాహిత్యంలో రొమాంటిక్ యుగాన్నీ, పోస్టు మాడర్నిజమ్ కూడా సమానాధికారంతో వివేచన చేయగలిగింది.
- దూసి ధర్మారావు
