• Sanatan
  • Ebook Hide Help
    ₹ 68
    75
    9.33% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • సనాతన్

    Sanatan

    Pages: 92
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఒకరోజు ఆగి నాగేష్ అనే వాడి గురించి ఎంక్వైరీ చేయటం మొదలెట్టాడు సనాతన్. “నవజ్యోతి" దినపత్రిక నారాయణగూడ ఏరియా విలేఖరి ప్రదీప్ తనకు ఫ్రెండ్. అతనికి ఫోన్ చేసి నాగేష్ గురించి అడిగాడు. అతను నాగేష్ గురించి చెప్తూ వాడి మీద ఇప్పటికే నారాయణ గూడ పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్ ఓపెన్ అయివుందని, వాడు కార్మిక శాఖామంత్రి జగన్నాధం మేనల్లుడని, వాడిమీద వున్న ఇప్పటికే వున్న కేసుల్లో సరైన సాక్ష్యాధారాలు దొరక్క పోలీసులు వాణ్ణి ఏమీ చేయలేకపోయారని చెప్పాడు. నాగేష్ ఓల్డ్ సిటీలో సులేమాన్ అనే వాడితో తిరుగుతుంటాడని, తరచూ వాణ్ణి కలుస్తుంటాడని చెప్పాడు.

ఇదేదో పెద్ద రాకెట్‌లా వుందే అనుకుంటూ రత్నమాల ఇచ్చిన సుందరి నెంబర్‌కి ఫోన్ చేసి

" సుందరీ ! మా ఫ్రెండ్ ఒకడు నీ నెంబర్ ఇచ్చాడు. వాడూ వద్దామనుకొని ఏదో అర్జెంట్ పని తగిలి ఆగిపోయాడు. ఎవరైనా కొత్తమ్మాయిలొచ్చారా ? " అని అడిగాడు. సుందరి అనుమానంగా మీ ఫ్రెండ్ ఎవరు ? " అని అడిగింది సుందరి.

" సూర్యాపేట సతీష్ ఇచ్చాడు నీ నెంబర్. వాడు నీకు బాగా తెలుసట గదా ?" తడుముకోకుండా అన్నాడు సనాతన్. సుందరి ఇంటికి అనేక మంది వస్తూపోతుంటారు వాళ్ళ పేర్లు ఆమెకేం గుర్తుంటాయి" అనుకుంటూ.

పాచిక పారినట్టుంది. " ఓహో సతీష్ ఇచ్చాడా ? రావటమైతే ఒక పదిమంది వరకు వచ్చారు. ఇప్పుడు మాత్రం ఇద్దరే వున్నారు. కావాలంటే సాయంత్రం 6 గంటలకు రండి. " అంది సుందరి. ఇలా కోడ్‌లో, పొడి పొడిగా మాట్లాడటం ఈ వృత్తిలో వున్న వాళ్లకి మామూలే.

" నాకిలాంటివి ఇదే ఫస్ట్ టైమ్. నాకు నీ అడ్రెస్ తెలీదు." అన్నాడు.

సుందరి నవ్వుతూ అడ్రెస్ చెప్పింది.

Preview download free pdf of this Telugu book is available at Sanatan