-
-
సంస్కార సమేత రెడ్డి నాయుడు
Samskara Sameta Reddy Naidu
Author: Varanasi Bhanumurthy Rao
Publisher: Thapasvi Manoharam Publications
Pages: 94Language: Telugu
వారణాసి భానుమూర్తిరావుగారి కథలు రాయలసీమ నేపథ్యంలో సాగినవి గతంలో చదివి ఉన్నాను. కథలు ఎంతో చక్కగా, ఆ ప్రాంత విశేషాలు, అక్కడి పరిస్థితులు, సమస్యలు ప్రతిబింబించే విధంగా ఉంటాయి. అదే లాగా వారి నవల ఈ "సంస్కార సమేత రెడ్డి నాయుడు" కూడా, రాయలసీమ నేపథ్యంలో, ఆ ప్రాంతంలోని రెండు ఉన్నత కుటుంబాలకు చెందిన కథగా సాగుతుంది. నవలలో కథ ఒకవైపు నడుస్తుండగా.. మరోవైపు ఆ ప్రాంత విశేషాలతో పాటు, ముఖ్యంగా చిత్తూరు గ్రామీణ ప్రాంతాల్లో, అక్కడ జరిగే అతిపెద్ద పండుగ, సంక్రాంతి గురించి, ఆ మూడు రోజులు జరిగే సంబరాలు, ఆచార వ్యవహారాలు, తెలియజేసి, వారి ప్రాంతంలో సంస్కృతి, సంప్రదాయాలు,, ప్రఖ్యాతి గాంచిన జల్లికట్టు గురించి కూడా రచయిత నేరుగా ప్రస్తావించారు. ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలు జరిగే తీరు, ఎలా ఉంటాయో కూలంకషంగా వివరించి కథారూపంలో నిక్షిప్తం చేశారు రచయిత.
- రాధికాప్రసాద్
