-
-
సంపూర్ణ మహాభారతం
Sampurna Mahabharatam
Author: Puranapanda Srichitra
Publisher: Mohan Publications
Pages: 270Language: Telugu
Description
శ్రీ వేదవ్యాస భగవానుడు తన మనుమల చరిత్రను ''శ్రీ మహాభారతము''గా ఒక లక్ష శ్లోకాలతో వ్రాశాడు. దీనిని ప్రపంచ భాషల్లోనికి యెందరో అనువదించారు. మన తెలుగులో దీనిని ముగ్గురు కవులు పద్యగద్యాల్లో తెనిగించారు. 1. నన్నయభట్టు 2. తిక్కన సోమయాజి; 3. ఎఱ్ఱాప్రెగ్గడ; యిందులో 18 పర్వాలున్నాయి. నన్నయభట్టు ఆదిపర్వం 'సభాపర్వం - అరణ్యపర్వంలో సగం భాగాన్ని వ్రాయగా' తిక్కన మహాకవి విరాటపర్వం నుంచి తక్కిన 15 పర్వాలూ ఆంధ్రీకరణ చేశాడు. అరణ్య పర్వశేషము వ్రాసిన ఎఱ్ఱాప్రెగ్గడ అరణ్య పర్వం శేషాన్ని తాను వ్రాసినా నన్నయభట్టు పేరుతోనే వ్రాశాడు. ఇది మహాభారత ఆంధ్రీకరణము.
మహాభారత - భాగవత - రామాయణాలు మన భారతీయ ఆర్షధర్మానికి పట్టుకొమ్మలు. అంతేకాక వీటికి మామూలుగా కథ ఉండి అందులో అంతరార్థంగా ఆధ్యాత్మిక - మంత్ర శాస్త్రాలు మనకు బోధిస్తాయి. యిది మహాభారతము గూర్చి ముందుగా తెలిసికొనదగింది.
Preview download free pdf of this Telugu book is available at Sampurna Mahabharatam
Login to add a comment
Subscribe to latest comments

- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE