-
-
'సంపద సృష్టికర్తలు ఎవరు' ?
Sampada Srushtikartalu Evaru
Author: Ranganayakamma
Publisher: Sweet Home Publications
Pages: 141Language: Telugu
గత కొన్ని సంవత్సరాలుగా, ప్రతీ డిసెంబరు లోనూ, అంతకు ముందు నెలల్లో నేను రాసిన వ్యాసాల్నీ, కధల్నీ ఒక సంపుటంగా ప్రచురిస్తూ వున్నాం. అదే రకంగా, ఈ సంవత్సరంలో నేను రాసిన వ్యాసాలనూ, ఇచ్చిన ఇంటర్వ్యూలనూ కలిపి ఇప్పుడు ఈ సంపుటం తెస్తున్నాము.
ఈ సంపుటంలో రెండు విషయాల గురించి ప్రత్యేకించి చెప్పాలి. దీనిలో మొట్టమొదటి వ్యాసం 'మార్క్సు ఎంగెల్సులు ఏ రకపు శ్రామికులవుతారు?' శ్రమ దోపిడీ రహస్యాన్ని కనిపెట్టిన ఈ జంట మేధావులు ఏ 'వర్గానికి' చెందుతారు? వీళ్ళు శ్రామికులైతే, ఏ రకం శ్రామికులవుతారు? ఈ ప్రశ్నలు హఠాత్తుగా నాకు వచ్చాయి. ఇవి అందరికీ ఆసక్తి కలిగించే ప్రశ్నలుగా భావించి, ఈ విషయం మీద ఒక వ్యాసం రాయాలనిపించింది.
ఈ సంపుటంలో, 2వ విషయం, గోవిందరాజు చక్రధర్ గారు, అనేక ప్రశ్నల రూపంలో నాతో జరిపిన ఇంటర్వ్యూ. ఆ ప్రశ్నల్నీ, వాటికి నేను ఇచ్చిన జవాబుల్నీ ఆయన 6 భాగాలుగా విభజించి, వేరు వేరు పత్రికలకి పంపారు. చక్రధర్ గారు, దాదాపు 40 ఏళ్ళ పాటు, జర్నలిస్టుగా పని చేశారు. ఈయన, “ఏ విలువలకీ ప్రస్థానం" అనే పేరుతో ఓ వీక్షణం' పత్రికలో రాసిన వ్యాసం చదివి, అది నచ్చడం వల్ల, ఇంటర్వ్యూ లంటే అంత ఆసక్తి నాకు లేకపోయినా, ఆయన ఇంటర్వ్యూ చేస్తానన్నప్పుడు, నేను జవాబులు ఇచ్చాను.
మిగతా వ్యాసాలు, వేరు వేరు పత్రికల్లో, ముఖ్యంగా ఆంధ్ర జ్యోతి, నవ తెలంగాణ పత్రికల్లో వచ్చినవి. అయితే, అక్కడక్కడా, ఈ వ్యాసాల్లో, కొన్ని వాక్యాలూ, కొన్ని పదాలూ, కొత్తవి చేరాయి. కొన్ని పోయాయి. స్పష్టత కోసం, నేను అలాంటి చిన్న చిన్న మార్పులు చేశాను.
- రంగనాయకమ్మ
