-
-
సంక్షిప్త శ్రీ మత్స్య పురాణము
Samkshipta Sri Matsya Puranamu
Author: C. V. S. Raju
Publisher: Victory Publishers
Pages: 93Language: Telugu
శ్రీ వేదవ్యాస కృతమైన మత్స్య పురాణాన్ని సంక్షిప్తం చేసి అందిస్తున్నారు విక్టరీ పబ్లిషర్స్, విజయవాడ వారు.
* * *
మహాపురాణాలు పద్దెనిమిది ఉన్నాయి. ''మహా'' అంటే ''గొప్ప'' అని అర్థం. చాలా ఉప పురాణాలు కూడా ఉన్నాయి. ''ఉప'' అంటే ''చిన్న'' అని అర్థం.
పురాణాలకి అయిదు లక్షణాలుంటాయి. అయిదు లక్షణాలు ఉంటేనే అది మహా పురాణం అవుతుంది. అంటే అయిదు విషయాల్ని మహాపురాణం వర్ణించాలి. అయిదు లక్షణాలు ఏమంటే - 1) సర్గ - విశ్వసృష్టి క్రమం 2) ప్రతిసర్గ - ప్రళయం, పునస్సృష్టి 3) శకాలు - మన్వంతరాలు 4) సూర్యవంశ చరిత్ర, చంద్రవంశ చరిత్ర 5) రాజవంశీయుల చరిత్రలు - వంశానుచరితలు. మత్స్య పురాణానికి యీ అయిదు లక్షణాలు ఉన్నాయి. కాబట్టి దీనిని మహాపురాణంగా చెప్పవచ్చును.
మత్స్యావతారం వృత్తాంతాన్ని తెలిపేది మత్స్యపురాణం. మహాపురాణాలలో మత్స్య పురాణం పదహారవది.
మత్స్యపురాణంలో పదిహేనువందల శ్లోకాలున్నాయి.
మత్స్యపురాణం రెండువందల తొంభై ఒక్క అధ్యాయాలుగా విభజింపబడింది.
