-
-
సామెతలూ జాతీయాలూ
Sametalu Jateeyalu
Author: Dr. Dwa. Na. Sastry
Publisher: Surya Prachuranalu
Pages: 49Language: Telugu
కవిగానే కాక ప్రముఖ విమర్శకుడుగా తనదైన ముద్ర వేస్తున్న సాహితీ స్రష్ట, బహుముఖ ప్రజ్ఞావంతుడు డా॥ ద్వానా శాస్త్రి. గత నాలుగు దశాబ్దాలుగా నిరంతర సాహితీ సేవకు అంకితమైన ఈ సాహితీ సవ్యసాచి సాహితీలోకానికి చిరపరిచితులు...‘అరవైలో యిరవై’ అనే మాటకు అసలైన అర్థం ద్వానా శాస్త్రి గారి నిత్య చైతన్యశీలతని పరిశీలిస్తే తెలుస్తుంది. కథలూ కవితలు నాటికలు ఎన్ని రాసినా విమర్శకుడిగా సమీక్షకుడిగా స్థిరపడి ఎనలేని గౌరవాన్ని సంపాదించుకున్నారు. పోటీ పరీక్షలు, సివిల్స్ పరీక్షలు రాస్తున్న వారికి తెలుగును బోధిస్తూ ఎంతో మందిని ఉత్తేజపరుస్తున్నారు. తెలుగు సాహిత్య చరిత్ర, అక్షర చిత్రాలు, సాహిత్య కబుర్లు, తెలుగు వెలుగు యిత్యాది నలభైకి పైగా గ్రంథాల్ని రచించిన వీరి సంపాదకత్వంలో వెలువడిన ‘మా నాన్నగారు’ అనే విశిష్ట గ్రంథం సాహితీ దిగ్గజాల ప్రశంసల్ని అందుకుంది. వీరి రచనలన్నీ సామాజిక ప్రయోజనం కలిగినవే కావటం గమనార్హం. ప్రస్తుత గ్రంథం ‘సామెతలూ... జాతీయాలూ’ కూడా సాహితీ లోకాన్ని ఆకట్టుకుంటుందన్న దాంట్లో సందేహం లేదు. తెలుగు భాషకు జవజీవాలు కల్పించే సామెతలూ జాతీయాల గురించి అందరికీ అర్థమయ్యేలాగ ఈ పుస్తకం రాయడం అభినందనీయం. ఇది వీరి 42వ పుస్తకం.
- సలీం
కేంద్రసాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత
