• Samarpana
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 189.6
    210
    9.71% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • సమర్పణ

    Samarpana

    Publisher: Srijana Lokam

    Pages: 222
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ప్రతి ''సమర్పణ''కు ఒక ''ఆంతర్యం'' ఉంటుంది. అందులో జీవన సంస్కారం కుదురుకొని ఉంటుంది. సుప్రసన్నగారి జీవన సంస్కారంలో ఒక తాత్త్వికగాఢత, సారస్వత ప్రౌఢిత పెనగొని వున్నాయి.

ఈ 'సమర్పణ' సంపుటి - అరసం నుంచి ఆధునికోత్తరకాలం వరకు నవతరం ఆలోచనలను విశ్లేషించడం ఒక వైపు; రాయప్రోలు, గురజాడ, విశ్వనాథ, కృష్ణశాస్త్రి వ్యక్తిత్వాల, రచనల తాత్త్వికాంశాల పరిశీలన నెపంతో - జాతీయత, కవిత్వలక్ష్యాల అనుశీలనం మరొకవైపు; నిర్దిష్టంగా చేసింది.

ఇందులో వ్యక్తుల సారస్వతవ్యక్తిత్వాలను నిర్దేశించడం వుంది. కథానిక, కాల్పనిక కవిత్వం, వచనకవిత్వం వంటి ప్రక్రియాంశాలను వివరించడం వుంది. కొన్ని పుస్తకాలను సమీక్షించడంతో పాటు మిత్రప్రశంస వుంది- అ సంపుటిలో వ్యాసాలన్నీ వేరు వేరు సందర్భాల కోసం వ్రాసినవి, పత్రికలలో ప్రకటించినవి, అందువల్ల ఆధునిక కవిత్వంలో ముక్తక లక్షణం వున్నట్టే, ఇటువంటి వ్యాసాలలో కూడా ముక్తకలక్షణం వుంటుందని చదువరులు మరువకూడదు.

ఆధునికత అనేది కాలికం కాదనీ, తాత్త్వికమైనదనీ నా విశ్వాసం. సువిశాల జీవన భూమికమీద నిలిచి, ఆగతానాగతాల సాహిత్య వివేచన చేయగల ధీర చిత్తులంటే నా కిష్టం. అందువల్ల సుప్రసన్న ఎంచుకున్న వివేచనామార్గం ఆదరణీయమని నమ్ముతున్నాను.

- ఇంద్రగంటి శ్రీకాంతశర్మ

Preview download free pdf of this Telugu book is available at Samarpana