-
-
సామాజిక విప్లవకారిణి సావిత్రీబాయి
Samajika Viplavakarini Savitribai
Publisher: Hyderabad Book Trust
Pages: 72Language: Telugu
భారతదేశ చరిత్ర రచనపై బ్రాహ్మణీయ భావజాల ప్రభావం అధికంగా ఉంది. దాని ఫలితంగా అట్టడుగు కులాలకూ, వర్గాలకూ చెందిన ఎందరో సామాజిక విప్లవకారుల కృషి మరుగున పడిపోయింది. ఆలస్యంగానైనా మనకు అందుబాటులోకి వచ్చిన ఉద్యమకారుల జీవితచరిత్రల్లో సాబిత్రీబాయి జీవితానికి గొప్ప ప్రాధాన్యత ఉన్నది.
ఆధునిక భారతదేశంలో మొట్టమొదటిసారిగా బ్రాహ్మణీయ కులతత్వ సంస్కృతి, మత వ్యవస్థలపై యుద్ధాన్ని ప్రకటించిన వ్యక్తులు జ్యోతిరావు ఫూలే, ఆయన భార్య సావిత్రీబాయి. విద్యను పీడితుల చేతి ఆయుధంగా మలిచారు.ఆ విశేషాలన్నింటినీ ఈ పుస్తకం వివరిస్తుంది.
జ్యోతిరావు ఫూలే , సహచరిగా ఆయన ఉద్యమ జీవితంలో తోడుగా నిలబడమేగాక, తనదైన స్వతంత్ర్య వ్యక్తిత్వాన్నీ, సాహితీ ప్రతిభనూ రూపొందించుకున్న వ్యక్తి సావిత్రీబాయి. నిబద్ధతతో ఉద్యమించిన మహిళల తొలిగురువు. ఈ పుస్తక రచయిత కాత్యాయని అనువాదకురాలిగా తెలుగు పాఠకులకు సుపరిచితురాలు. పలు నవలలు, సాహిత్య పుస్తకాలను తెలుగులోకి అనువదించారు. "చూపు" పత్రికను నిర్వహించారు.
