-
-
సామాజిక హితకారిణి
Samajika Hitakarini
Author: Kekalathuri Krishnaiah
Pages: 80Language: Telugu
జీవితం
సమస్యలు లేని జీవితం ఉండదు
సమస్య నుండి మరో సమస్యకు
ప్రయాణమే జీవితం
కెరటాలు కాళ్ళ దగ్గరకొస్తున్నాయని
సముద్రాన్ని చులకనగా చూడకు
వ్యక్తి సమానంగా ఉన్నాడని
తక్కువ అంచనా వేయకు
సంతోషం కలిగినప్పుడు
ప్రమాదం సంభవించినప్పుడు
శత్రుభయం చెలరేగినప్పుడు
రాజసభలోనూ,శ్శసానంలోనూ
నీతో ఉన్నవాడే నిజమైన బంధువు
ఇంట్లో, బయటి వ్యవహారాలలో
సానుకూల ధోరణిలో వ్యవహరించు
ఒనగూడెదరు శ్రేయోభిలాషులు
సకల కార్యములు ఒనరును సఖ్యముగా
శత్రువులను పెంచి కార్యముల చెరచు
సృష్టి వెలసెను సత్యం, ప్రేమ, ధర్మములతో
వీటిని పాటించిన వ్యక్తి పూజనీయుడగును
మొదట సత్యంబు పాటించడం కష్టమగును
ఓటమితో కొనసాగిన విశ్వాసము పెరుగు జనులలో
నీమీద విశ్వాసమే జీవితంలో మంచి పెట్టుబడి
హృదయాన్ని నాశనం చేస్తుంది ‘ద్వేషం’
సంస్కారాన్ని ధిక్కరించు ‘దురాశ’
వ్యక్తుల మధ్య అగాధాన్ని సృష్టించు ‘భేదభావం’
కనిపించని సంకెళ్ళు ‘దుర్వ్యసనాలు’
జీవితాన్ని మింగేస్తుంది ‘స్వార్థం’
పంచు ప్రేమను నిరంతరం
పెంచు విశ్వప్రేమికుల సంఖ్య
పసిడి పందిళ్ళలో కళకళలాడుతూ
ప్రతి ఇల్లూ ఆనందాల పొదరిల్లగును.

- ₹154.02
- ₹216
- ₹255
- ₹162
- ₹122.4
- ₹181.56