-
-
సమగ్ర భారత చరిత్ర - మధ్యయుగం
Samagra Bharata Charitra Madhyayugam
Author: K. KrishnaReddy
Pages: 394Language: Telugu
క్రీస్తు శకం తొలి సహస్రాబ్ది మధ్య నాటికి భారతదేశ చరిత్రలో అతిపెద్ద పరివర్తనం దాదాపు సక్రియంగా ఉంది. అంతకు ముందు వచ్చిన మహాపరివర్తనంలో మౌర్య, గుప్త సామ్రాజ్యాలలో కూడిన చారిత్రక ఘట్టం ఇమిడి ఉంది. ఈ రెండవ పరివర్తనా కాలం సుమారు పది శతాబ్దాల పాటు కొనసాగింది. అంటే ఎనిమిదవ శతాబ్దపు మధ్య దశకాల నుండి తొలి ఆధునిక కాలమైన 18వ శతాబ్దపు మధ్యదశకాల వరకు ఈ పరివర్తన సంభవించింది. దాని తొలి చరిత్ర ప్రాచీన భారత పోకడలతో ప్రారంభమైనప్పటికీ వాటిని మధ్యలోనే వదిలించుకొంది. దాని మలి చరిత్ర ఆధునికతకు ఒక స్వరూపాన్ని ఇచ్చింది. ఈ సుధీర్ఘ మధ్యయుగ పరివర్తన వెల్లువలా వచ్చిపడిన శిలాశాసనాలతో దర్శనమిస్తుంది. విభిన్న సముదాయాలపై , విభిన్న ప్రాంతాలపై ఆధిపత్యం వహించిన అనువంశిక పాలకులు, అప్పటి సామాజిక కార్యకలాపాల గురించి ఈ శిలాశాసనాలు చక్కటి వర్ణనలు అందిస్తాయి. ఈ విశాల వీక్షణంలో మనము తొలి మధ్యయుగ శతాబ్దాలలో సమాజాలను, వాటిలోని సామాజిక స్వరూపాలను మార్చివేసిన ప్రధాన ఘట్టాలను పరిశీలిద్దాం. తర్వాత రెండవ సహస్రాబ్ది ఆరంభంలో సంభవించిన పరిణామాలను, చివరగా 1500 నుండి తొలి ఆధునిక యుగ లక్షణాలు సంతరించుకున్న కాలం వరకు జరిగిన పరిణామాలను విశ్లేషిద్దాం.
- ప్రచురణ కర్తలు
