-
-
శాలువా
Saluva
Author: Pidugu Papireddy
Publisher: Self Published on Kinige
Pages: 151Language: Telugu
కథానిక వస్తువులో కథాత్మక వాస్తవికత ఉండాలి. నగ్నవాస్తవికత ఉండకూడదు. అలాగే కల్పనా ఉండాలి. అయితే అది ఆకాశమార్గం పట్టకూడదు. ఈ రెంటి సమన్వయ సిద్ధి ద్వారా కథాంశాన్ని సమ్యగ్దర్శనం చేయించాలి రచయిత. ఉత్తమ సృజనకారులు మాత్రమే ఆ విజయం సాధించగలరు. పాపిరెడ్డి గారు ఉత్తమోత్తమ సృజనకారులు.
- విహారి
తీసుకున్న ఇతివృత్తాన్ని కళాత్మక విలువలున్న కథగా మలిచే శక్తి పాపిరెడ్దికుంది. బలహీన వర్గాలపట్ల సానుభూతి, పఠనీయతాగుణం, ఆలోచింపజేసే గుణం, కళాత్మక విలువలతో కథను రూపొందించే నేర్పు మొదలైన గొప్ప కథకునికుండాల్సిన గుణాలన్నీ పాపిరెడ్డికున్నాయి....!
- అంపశయ్య నవీన్
పాపిరెడ్డి గారి కథలో కొన్ని గొప్ప నిత్యసత్యాలున్నాయి. శైలి, శిల్పం, భాషానిర్మాణం, సౌందర్యపు కుప్పలోంచి లాగి అమర్చినట్లున్నాయి.
- డా. పెళ్ళకూరు జయప్రద
విభిన్న కులాలతో ఒకే కులంగా వరుసలు కలుపుకుంటూ సాగించే జీవన విధానం పల్లెల్లోనే ఎక్కువగా మనం చూస్తూంటాం... ఇలాంటి విషయాలనెన్నింటినో పల్లెభాషలో కథలుగా మలచి అందించడంలో పాపిరెడ్డిగారు ఫలదీకరణం చెందారు.
- కలిమిశ్రీ
