-
-
సాహితీపరులు పాత్రికేయులతో సరసాలు
Sahitiparulu Patrikeyulato Sarasalu
Author: Narisetti Innaiah
Publisher: Sastriya Parisodhana Kendram
Pages: 81Language: Telugu
రచయితలు, కవులు భిన్న రంగాలలో తమ వ్యక్తిత్వాన్ని వెల్లడిస్తారు. జీవితమంతా 24 గంటలూ కవులుగా, రచయితలుగా ఎవరూ వుండరు. అయితే పాఠకులు వాటిపై దృష్టి పెట్టరు. కవిని కేవలం కవిత్వ విలువలతో చూస్తారు. అలాగే రచయితల్ని కూడా ఇది సహజమే. నేను కవినీ, రచయితనూ కాను. జీవితంలో వివిధ సందర్భాలలో అనేక మంది రచయితలతో, కవులతో ఏదొక విధంగా సంబంధాలు ఏర్పడ్డాయి. కొందరితో సన్నిహితంగా స్నేహం లభించింది. ఆ విధంగా వారి వ్యక్తిత్వాలను, భిన్న కోణాలలో చూడడానికి వీలైంది.
ఈ వ్యక్తిత్వ చిత్రణలో నిశిత పరిశీలన, చనువుతో గూడిన వ్యాఖ్యలు, అంచనాలు వుంటాయి. వ్యక్తుల జీవిత చరిత్ర యిందులో వుండదు. బాగా పేరు పొందిన వారి నుండి మరుగుపడి పోయిన వారి వరకూ మీరు చూస్తారు. అందరికీ తెలియని అంశాలు ప్రస్తావనకు వస్తాయి. అభిమానులు వీరాభిమానులు చూచిన దృష్టి యిక్కడ కనిపించకపోవచ్చు.
వ్యక్తులలో ఎన్ని వైవిధ్యాలు, విభిన్న రీతులు వుంటాయో యిక్కడ గమనించవచ్చు. చనిపోయిన వారితో ఆరంభించి, ఉత్తరోత్తరా యిప్పడున్న వారిని గమనించడం యీ క్రమంలో చూస్తారు. మిత్రులు సి. భాస్కర రావు మాటల సందర్భంలో, జంధ్యాల పాపయ్య శాస్త్రి ఫోటో కోసం ఇంటర్నెట్లో వెతికితే కనిపించలేదన్నాడు. మీకు తెలుసా అని నన్నడిగాడు. పాపయ్యశాస్త్రి నాకు నాలుగేళ్ళపాటు గుంటూరు ఎ.సి. కళాశాలలో టీచరనీ, ఆయన పోటో నా దగ్గర వుందనీ చెబితే, ఆశ్చర్యంతో సంతోషించాడు. అలా సంభాషణలో మరికొన్ని పేర్లు రాగా, వారు నాకు తెలుసు అన్నప్పుడు, అయితే మీరు అనుభవాలు రాయాల్సిందే అని పట్టుబట్టారు. ఈ శీర్షికకు ఆ విధంగా నాంది పలికాం. ముందే చెప్పినట్లు సమగ్ర చరిత్ర, సమాచారం అందించడం యిక్కడ వుండదు. కనుక సూచన ప్రాయంగా తప్ప, స్పష్టమైన తేదీల కోసం, వివరాల కోసం చూస్తే, నిరాశే ఎదురౌతుంది. తెలిసిన వారి సన్నిహిత జాబితా నూటికి పైనే వుంది. కొందరి గురించి ఎక్కువగా ఇంకొందరి పట్ల తక్కువ వుండడంలో పక్షపాతం వలన కాదు. వ్యక్తుల్ని విశాల కోణంలో చూడడానికి యిదొక దుర్భిణి మాత్రమే. భిన్న వ్యక్తుల్ని గురించి రాయడంలో విభిన్న రీతులుంటాయి. ఒకే మూస వుండదు.
- నరిసెట్టి ఇన్నయ్య
గమనిక: "సాహితీపరులు పాత్రికేయులతో సరసాలు" ఈబుక్ సైజు 22.4 mb

- FREE
- FREE
- ₹162
- ₹129.6
- FREE
- ₹129.6