-
-
సాహితీ సౌరభం
Sahiti Sourabham
Author: Tummeti Raghottama Reddy
Pages: 110Language: Telugu
సాహితీ సౌరభం
(సినిమా వ్యాసాలు - రచయితల స్మృతులు - పుస్తకసమీక్షలు - ముందుమాటలు - ఇంటర్వ్యూలు - లేఖలు)
గోదావరిఖని ఫిలిం సొసైటీ కార్యక్రమాల ప్రచారం కోసం ఆ రోజుల్లో రాసిన మూడు కరపత్రాలను చేర్చాను. అంతకుమించి సినిమా గురించి నేను రాయలేదు.
నేను ఎరిగిన రచయితలు చనిపోయిన సందర్భాల్లో, వారిని నేనెరిగిన కోణంలోంచే కొద్దిగా రాసాను మినహా, వారివారి సాహిత్య కృషి గురించి వివరంగా నేను రాయలేదు. విశ్వనాథరెడ్డిగారి గురించి 'నా రచనా నేపథ్యంలో' రాసిన భాగాన్ని, ఒక ప్రత్యేక సంచిక కోసం వారడిగితే, విస్తరించి రాసి పంపాను. దాన్ని కూడా ఇందులో చేర్చాను.
ముందుమాటలు కూడా మిత్రుల ఒత్తిని కాదనలేక, పరిచయాల వంటివి రాసానుకాని, పుస్తకాలకు విపులమైన ముందుమాటలు కాదు. అట్లాగే కొన్నిపుస్తక సమీక్షలు కూడా.
మూడు ఇంటర్వ్యూలను, మరో నాలుగు చిన్న లేఖల్ని ఇందులో చేర్చాను, ఆసక్తిగల పాఠకమిత్రుల కోసం.
కాళోజి, మధురాంతకం సదాశివుడు (గోదావరిఖని కవి) వంటివారి గురించి రాయాల్సిందికాని, రాయలేకపోయాను.
- తుమ్మేటి రఘోత్తమరెడ్డి

- ₹60
- ₹162
- ₹432
- ₹324
- ₹108
- ₹108