• Sahitee Mutyalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • సాహితీ ముత్యాలు

    Sahitee Mutyalu

    Pages: 70
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మనిషి శరీరానికి మలినం అంటుకుంటే గంగతో కడిగివేయవచ్చు. మనస్సుకు మాలిన్యం అంటుకుంటే ఏం చేయాలి! ఏం చేయాలి అనే ప్రశ్న వేస్తే ఆర్ష సాహిత్యం జ్ఞానంతో శుభ్రం చేయాలి అని సమాధానమిచ్చింది.

వేదాలు, ఉపనిషత్తులు, స్మృతులు, దర్శనాలు, ఇవన్నీ ఆర్ష సాహిత్యం క్రిందకే వస్తాయి. ఈ సాహిత్యమందించిన సూత్రాలు, సూక్తుల ఆధారంగానే రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలు, కావ్యాలు ఎన్నో హితవచనాలు పలికాయి. వాటి ఆధారంగా దేశీ రచనలు కూడా వచ్చాయి.

ఇవన్నీ తెలుగునాట శాలివాహన గాథాసప్తశతి నుండి నిన్నమొన్నటి వివేకభారతం వరకు ఏదోవిధంగా సమాజంలోకి తీసుకొని వెళ్ళడానికి ఎందరో కవులూ, రచయితలు, విమర్శకులు, ఉపన్యాసకులు అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఎందుకీ ప్రయత్నాలు అంటే మనోమాలిన్యం తొలగించడానికే అని సమాధానం.

ఆ సదుద్దేశంతోనే మిత్రులు శ్రీ వేదార్థం మధుసూదన శర్మ గారు 11 వ్యాసాలతో ఈ ‘సాహితీ ముత్యాలు’ గ్రంధాన్ని మనకందిస్తున్నారు. ఈ వ్యాసాలన్నీ ఏదో మాసపత్రికలో ప్రచురింపబడ్డవే, ఆకాశవాణిలో ప్రసారమైనవే.

పరిచయాత్మక వ్యాసాలు, సమీక్షాత్మక వ్యాసాలు, విశ్లేషణాత్మక వ్యాసాలు, వర్ణణాత్మక వ్యాసాలు, పరిశోధనాత్మక వ్యాసాలని వ్యాసాలనెన్నో విధాలుగా వర్గీకరించి అధ్యయనం చేయవచ్చు. శ్రీ శర్మ గారి వ్యాసాలన్నీ పరిచయాత్మకాలకిందికే వస్తాయి.

- ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి

Preview download free pdf of this Telugu book is available at Sahitee Mutyalu