• Sagara Tarangalu
 • Ebook Hide Help
  ₹ 30 for 30 days
  ₹ 146.4
  162
  9.63% discount
  • fb
  • Share on Google+
  • Pin it!
 • సాగర తరంగాలు

  Sagara Tarangalu

  Author:

  Publisher: Hyma Srinivas

  Pages: 223
  Language: Telugu
  Rating
  4.50 Star Rating: Recommended
  4.50 Star Rating: Recommended
  4.50 Star Rating: Recommended
  4.50 Star Rating: Recommended
  4.50 Star Rating: Recommended
  '4.50/5' From 14 votes.
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  '5/5' From 1 premium votes.
Description

"అక్షర లక్షల కినిగె తెలుగు నవలల పోటీ 2014" కి "హైమా శ్రీనివాస్" పంపిన నవల "సాగర తరంగాలు".

* * *

KinigeNovelCompetitionLogo
నెమ్మదిగా గొంతు సమవించుకుని జానకమ్మ మొదలెట్టింది."మీరంతా అనుకుంటున్నంత గొప్ప దాన్నేం కాదర్రా! కాకపోతే ఇప్పటిదాకా భగవంతుడిచ్చిన జీవంతో ఐదు తరాలను చూశాను. అందరితో కల్సి జీవించాను. ఈ ప్రపంచం ఒక సముద్రం ఐతే మనమంతా దానిలోని అలలం. ఒక అల ముందుకొచ్చి ఎగిరిపడి వెనక్కెళ్ళి మళ్ళీ తన తల్లైన సముద్ర జలంలో కలసిపోతుంది. మరో అల ముందుకు వస్తుంది, అదీ వెనక్కెళుతుంది. దానికంటే పెద్దవీ, చిన్నవీ ఎత్తైనవీ గంభీరమైనవీ అలలు వస్తూనే ఉంటాయి. ఆ అలలనంతా చూస్తూ దూరం నుండీ భగవంతుడు నవ్వుకుంటుంటాడేమో!

నదీనాం సాగరో గతిః -- అన్నట్లుగా, జీవాత్మలన్నీ పరమాత్మలో విలీనం కాక తప్పదు. అన్ని నదులూ సముద్రంలో కలసిపోయి తమ అస్తిత్వం కోల్పోయి, సముద్రజలల్లో కలసి పోతాయి. తీయని, కమ్మని నీరంతా ఉప్పగా మారిపోతుంది. మనమంతా జీవాత్మలం, చివరకు భగవంతునిలో అంటే పరమాత్మలో కలసి పోవలసిందే! మన ఆస్తులూ, ఆర్భాటాలూ, అహంకారాలూ, అహంభావాలూ అన్నీ ఏమీ మిగలవు. ఈ శరీరం కూడా మాయమై పోతుంది. మిగిలేది మనం జీవించి ఉన్నపుడు చేసిన మంచిపనులు, చెడ్డ పనుల ఫలితాలే!. మన స్వభావం తాలూకూ ప్రతిబింబాలు అవి. మంచి మనిషి చావు మరణంలో తెలుస్తుందన్నమాట గుర్తుంచుకోవాలి. ఎందరినో ఏడిపించి, మన గొప్పకోసం, స్వార్ధంకోసం, ఎందరినో బలిపెడతాం. చివరకు మనమూ మిగలం, ఏదీ శాశ్వతం కాదని గుర్తించి, జీవించి ఉన్నంతకాలం నలుగుర్నీ సంతోషపెట్టి, అందరి సుఖంకోసం మన స్వార్ధాన్ని కాస్తంత పక్కనపెడితే మనకు లభించే ఆనందం, సంతృప్తీ ఇంతా అంతా కాదు.

ఒకరు చనిపోతే 'చచ్చాడు పీడవదలింది' అంటారు, మరొకరు చనిపోతే 'పాపం మరణించాడు మహానుభావుడు' అంటారు, అదే తేడా. కొందరి సమక్షంలో ఆనందిస్తే, మరికొందరి సమక్షంలోకి రానే భయపడి తప్పుకుంటారు. అదే వారి స్వభావాలను తెలుపుతుంది. మాకాలం లోనూ రోజుకు 24 గంటలే. నేడూ అంతే, కానీ ఆ కాలపు ఆత్మీయతలు, నేడు కరువైపోయి, కాలం వేగంగా పరుగెడుతున్నట్లు ఉందిప్పుడు, మనిషి కోరికల గుర్రాలకు పగ్గాలు వదిలేయటమే ఆ వేగానికి కారణం. నేను ఈ ఐదు తరాల్లో గమనించిన విషయాలు ఇవే! ఇంత కంటే చెప్పేదేమీ లేదు. మీ అందరి ఆదరాభిమానానికీ నా ఆశీర్వాదాలు. భగవంతుడు మీ అందరికీ మంచి సుగుణాలను ప్రసాదించి, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో దీవించాలని కోరుతున్నాను." అంటూ అలసటతో ఆపిందామె. అంతా కరతాళ ధ్వనులుచేశారు.

Preview download free pdf of this Telugu book is available at Sagara Tarangalu