-
-
సాగర మథనం
Sagara Mathanam
Author: Ganti Bhanumathi
Publisher: Ganti Prachuranalu
Pages: 182Language: Telugu
Description
ఇందులోని ఇరవై రెండు కథలూ మనసుపెట్టి చదివితే పాఠకులను 'చేరవలసిన చోటికే' చేరుస్తాయి.
గంటి భానుమతిగారి కథలన్నింటిలో మానవీయం వెన్నంటి వుంటుంది. కంటికి చెమరింపునూ, హృదయానికి ఆర్ద్రతనూ కలిగించడం చాలా కథల్లోని మౌలిక లక్షణం. స్త్రీలకు సంబంధించిన ఇతివృత్త కథనాల్లో కూడా అభ్యుదయ దృక్పథం విడవకుండానే, కుటుంబాన్నీ, మనుషులనూ ఏకత్రితం చేసి హృదయదఘ్నంగా ఉన్నతంగా, ఉదాత్తంగా నిలిచే 'మానవి'ని మలిచి చూపారు రచయిత్రి. ఉత్తమ కథా రచయిత్రిగా తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం అందుకున్న గంటి భానుమతిగారు పాఠకుల మనస్సుల్లో అలా తన స్థానాన్ని పదిలపరుచుకోగలరన్న దానికి సరికొత్త దాఖలా ఈ కథా సంపుటి.
జీవనామృతాన్ని అందించగల 'సాగరమథనం'కు స్వాగతం చెప్పండి. అభివ్యక్తి సామర్థ్యంగల ఈ రచయిత్రి కథా సుధాస్వాదనం చేయండి.
- సుధామ
Preview download free pdf of this Telugu book is available at Sagara Mathanam
Login to add a comment
Subscribe to latest comments
