-
-
సగం సగం కలసి
Sagam Sagam Kalasi
Author: Kodam Pavankumar
Publisher: Laya Publications
Pages: 116Language: Telugu
Description
కవిగాను, మనిషిగాను పవన్ తనలోని సంక్షోభానికి భయపడడు. సామాజిక సంక్షోభాలకు తల్లడిల్లుతాడు. తనని తాను కాదు, తన చుట్టూ ఉన్న సామాన్యప్రజలపై ఈ సంక్షోభ కరవాలాల వేటుని చూసి చలించిపోతాడు. ఈ సంక్షోభం అన్ని సామాజిక రంగాలలోకి పాకిపోవడం గమనిస్తాడు. తాను తన అక్షరాలను పదునుపెట్టి, వాటినే తన రక్షణకవచాలుగా చేసుకుని ఏకలవ్యుడిలా, అభిమన్యుడిలా ఏకకాలంలో ముందుకు సాగిపోతాడు. ఈ ఉద్యమంలో తాను వర్గవాదా, అస్తిత్వవాదా అనే యోచన చేయడు. సంక్షోభాల్ని ముందుగా బట్టబయలు చేస్తాడు. అందుకు తన పాఠకుల మద్దతు కోరుతాడు. తన అనుభవాన్ని వాళ్ళదిగా చేసి తనవైపు తిప్పుకుంటాడు. ఇప్పుడు వాళ్ళు పాఠకులు కాదు, పుస్తక ప్రియులు అంతకన్నా కాదు. వారు తన సహచరులు, సహోద్యమ కార్యకర్తలు. అక్కడే పవన్ వంటి కవుల అవసరం ఎంతైనా ఉంది.
- ప్రొ. జయధీర్ తిరుమలరావు
Preview download free pdf of this Telugu book is available at Sagam Sagam Kalasi
Login to add a comment
Subscribe to latest comments
