• Sagam Akkada Sagam Ikkada
 • Ebook Hide Help
  ₹ 108
  120
  10% discount
  • fb
  • Share on Google+
  • Pin it!
 • సగం అక్కడా.. సగం ఇక్కడా!

  Sagam Akkada Sagam Ikkada

  Pages: 106
  Language: Telugu
  Rating
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  Be the first to vote
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  '0/5' From 0 premium votes.
Description

ఇదే మండువాలో.. పసుపు పచ్చని పట్టుచీర, ఎర్ర జాకెట్టు.. మెడలో మోయలేనన్ని నగలు వేసుకుని కాటుక కళ్ళతో ఓరకంట పరిసరాలు గమనిస్తూ భట్టు పక్కన కూర్చుని పూజ చేస్తోంది అరవింద.

పద్నాలుగేళ్ళు కూడా నిండని మొహంలో పసితనపు ఛాయలు ఇంకా వదల్లేదు. నాలుగు రోజుల్లో బొంబాయి ప్రయాణం. తలుచుకుంటే గాభరాగా ఉంది. మూడు రోజుల ప్రయాణం. అంత పెద్ద పట్నంలో భాష రాకుండా ఎలా ఉండడం.. లైబ్రరీలో చదివిన పుస్తకాలు ఇచ్చిన విజ్ఞానం ఎంత వరకూ పనికొస్తుంది.. అసలు ఇంకా చదువుకుంటానంటే వినకుండా పెళ్ళి.. కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.

అప్పుడే రెండేళ్ళయింది.

అరవింద తన ఈడు పిల్లలందరితో పోలుస్తే చాలా చురుకుగా ఉండేది.

"అమ్మో! ఇది ఏకసంతగ్రాహే కాకుండా దీని జ్ఞాపకశక్తి అమోఘంరా! ఏ శ్లోకం చెప్పినా ఇట్టే పట్టేస్తుంది." నిద్రపోయిందనుకుని తాతగారు అందరితో అంటున్న మాటలు విని కళ్ళు మరింత గట్టిగా మూసుకుంది అరవింద. పన్నెండేళ్ళకే యస్ససెల్సీకి వచ్చేసింది.

ఆ ఊర్లో ఆడపిల్లల బడిలేకపోతే నాలుగు మైళ్ళ అవతలున్న తాలూకా పట్టణానికి ఎడ్లబండిమీద పంపిస్తున్నారు తాతగారు. కానీ పరీక్షలు రాయిస్తారో లేదో అనుమానమే.. వయసుకి ఎగ్జంప్షన్ తెచ్చుకోవాలిట. అరవింద అవేం పట్టనట్లు తన చదువు తను చదువుకుంటోంది. ఎలా అయినా స్కూల్ ఫస్ట్ రావాలి.. అదే ధ్యేయం.

"ఆడపిల్లకి ఈ శక్తులన్నీ ఎందుకండీ.. అందరూ మెచ్చేలా కాపురం చేసుకోవాలి కానీ.." నాన్నమ్మ వెంటనే నొక్కులు నొక్కుతుంటే పళ్ళు నూరింది అరవింద.

"అన్నాపురం కరణంగారి రెండో అబ్బాయి ప్లీడరీ చదివాడుట. మన పిల్లంటే మక్కువ చూపిస్తున్నారని విన్నాను. చెప్పొద్దామా?" నాన్నగారు అంటుంటే గుండె దడదడలాడింది. అరవింద లేచి కూర్చుంది.

"ఓహ్! ఇది ఒక చెవి ఇటేసుంచుతుంది. మహ కష్టం దీనితో.."

"తాతగారూ! నేను ఇప్పుడు పెళ్ళి చేసుకోను. కాలేజీలో చదువుతా." తాతగారి దగ్గరికి వెళ్ళి గారంగా అంది. ఆయన తన పక్షం అనుకుని.

"సర్లే.. ఇంకా బడికి పంపుతున్నాం సంతోషించు. మనిళ్ళల్లో కాలేజీలు.. చదువులూ ఉన్నాయా? వెళ్ళి నిద్దరో!" నాన్నమ్మ విసురుకి స్పందించకుండా తాతగారిని చూసింది. ఆయన కూడా నోరు మెదపలేదు.. ఏదో ఆలోచిస్తున్నట్లు.

"అవునురా! కరణంగారిది మంచి సంబంధమే.. మంచిరోజు చూసుకుని వెళ్ళి చెప్పొద్దాం." ఉక్రోషంగా చూస్తూ నిస్సహాయంగా వెళ్ళి తన పక్కమీద వాలి పోయింది అరవింద. తనకి చిన్నప్పట్నుంచీ దేనికీ ఏడవడం నచ్చదు. ఎవరూ తన మాట, అభిప్రాయం వినిపించుకోనప్పుడు నోరుమూసుకుని సర్దుకోడమే అలవాటు.

Preview download free pdf of this Telugu book is available at Sagam Akkada Sagam Ikkada